Hanuma Vihari: ఇక ఆంధ్రా జట్టుకు ఆడను.. విహారి వర్సెస్ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్

ఆంధ్రా రంజీ టీమ్‌కు హనుమ విహారీ (Hanuma Vihari) గుడ్‌బై చెప్పాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధికారులు తనను తీవ్రంగా అవమానించారని ఆ జట్టు సారథ్య బాధ్యతలతో పాటు ఆంధ్ర టీమ్‌కు వీడ్కోలు పలికాడు.

  • Written By:
  • Updated On - February 27, 2024 / 11:07 AM IST

Hanuma Vihari: ఆంధ్రా రంజీ టీమ్‌కు హనుమ విహారీ (Hanuma Vihari) గుడ్‌బై చెప్పాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధికారులు తనను తీవ్రంగా అవమానించారని ఆ జట్టు సారథ్య బాధ్యతలతో పాటు ఆంధ్ర టీమ్‌కు వీడ్కోలు పలికాడు. సోషల్ మీడియా వేదికగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌ అధికారులపై విహారీ సంచలన ఆరోపణలు చేశాడు. ఓ రిజర్వ్ ప్లేయర్‌ను తిట్టానని, తనను సారథ్య బాధ్యతల నుంచి తప్పించారని ఆరోపించాడు. తక్షణమే ఆంధ్ర టీమ్ నుంచి తప్పుకుంటున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు. ఇండోర్ వేదికగా మధ్యప్రదేశ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆంధ్ర ఓటమిపాలైంది. ఈ ఓటమి అనంతరం అంధ్ర టీమ్‌కు గుడ్‌బై చెబుతూ విహారి ఓ పోస్ట్ పెట్టాడు. ఈ మ్యాచ్ సందర్భంగా జట్టులోని 17వ ప్లేయర్‌‌ను తాను మందలించాననీ, దానికి బాగా హర్ట్ అయిన సదరు ప్లేయర్.. రాజకీయ నాయకుడైన తన తండ్రి ద్వారా తనపై అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశాడన్నాడు.

దీంతో అసోసియేషన్ అధికారులు కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని తనను కోరారన్నాడు. ఎలాంటి తప్పిదం లేకున్నా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించడం బాధించిందన్నాడు. అసోసియేషన్ తన కంటే సదరు ప్లేయర్ గొప్పవాడని భావించిందని, 16 అంతర్జాతీయ టెస్ట్‌లు ఆడిన తనకు కనీస గౌరవం ఇవ్వలేదంటూ ఫైరయ్యాడు. ఎంతో అవమానకరంగా ఫీలైనా.. ఆటపై ఉన్న గౌరవంతో ఈ సీజన్ మొత్తం ఆడాననీ, జట్టు కంటే ఆ ప్లేయర్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడాన్ని తప్పుపట్టాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో క్రీడాకారుల కన్నా.. రాజకీయాలకే ప్రాధాన్యత ఎక్కువని ఆరోపించాడు. ఆంధ్ర క్రికెట్ జట్టు పై ఉన్న అభిమానం, క్రికెట్ పై ఉన్న ప్రేమతో ఇప్పటివరకు ఈ విషయాన్ని బయటకు వెల్లడించలేదన్నాడు. గత సీజన్ లో కుడి చేతికి దెబ్బ తగిలినప్పటికీ… ఎడమ చేతితో బ్యాటింగ్ చేసిన నాకు అసోసియేషన్ చేసిన అవమానం తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆంధ్ర జట్టును, క్రికెట్ ను ఇప్పుడు గౌరవిస్తానని చెప్పుకొచ్చాడు. ప్రతి సీజన్లో మనం ఎదుగుతున్న విధానాన్ని తాను ఇష్టపడినా.. అసోసియేషన్ మనం ఎదగాలని కోరుకోవడం లేదంటూ విహరి వ్యాఖ్యానించాడు.

Also Read: Neil Wagner: క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన న్యూజిలాండ్ స్టార్ క్రికెట‌ర్‌..!

అందుకే ఆంధ్ర జట్టుకు మళ్లీ ఆడవద్దని నిర్ణయించుకున్నట్టు హనుమ విహారి తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. తన పోస్టులో సదరు ప్లేయర్ పేరును హనుమ విహారి ప్రస్తావించలేదు. కానీ యువ ప్లేయర్ అయిన పృథ్వీ రాజ్ హనుమ విహారి ఆరోపణలపై స్పందించాడు. ఆట కంటే ఎవరూ కూడా గొప్ప కాదన్నాడు. నువ్వు ఇంతకు మించి ఏమి పీకలేవురా.. ఛాంపియన్. నీకు కావాల్సిన సానుభూతి గేమ్స్ ఆడుకో అంటూ పృథ్వీ రాజ్ ఘాటుగా బదులిచ్చాడు. ఆంధ్రకు చెందిన పృథ్వీ రాజ్ ఒకే ఒక లిస్ట్ ఏ గేమ్ ఆడాడు.

We’re now on WhatsApp : Click to Join