Site icon HashtagU Telugu

Vinesh Phogat : వినేశ్ ఫోగాట్ అనర్హతపై ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌

Vinesh Phogat Letter

Vinesh Phogat Letter

వినేశ్‌ ఫోగట్‌ అనర్హత వేటు (Vinesh Phogat Disqualified)పై దేశం మొత్తం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఏడాదికిపైగా వివాదాలు.. విమర్శలు.. అవమానాలు.. ఇలా ఎన్నో వాటిని ఎదురుకొని..పారిస్ ఒలింపిక్స్ లో అడుగుపెట్టిన వినేశ్ ఫోగాట్..తనదైన శైలిలో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తూ ఫైనల్ కు చేరింది. స్వర్ణ చరిత్రకు అడుగు దూరంలో ఉండగా..ఒలింపిక్స్ నిర్వాహకులు భారీ షాక్ ఇచ్చారు. వినేశ్ ఫోగాట్ 100గ్రాములు బరువు అధికంగా ఉందంటూ ఆమెపై అనర్హత వేటు వేశారు. దీనిపై యెవత్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒలింపిక్స్ ను బాయ్ కట్ చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వినేశ్‌ ఫొగాట్‌పై అనర్హత వేటు వార్త నిజం కాకుంటే బాగుండు అంటూ ఎక్స్‌ వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు.

వినేశ్ ఫొగట్ (Vinesh Phogat) ఫై అనర్హత వేటు పడిన నేపథ్యంలో పార్లమెంట్లో విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. ఈ విషయంపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో క్రీడాశాఖ మంత్రి ప్రకటన చేస్తారని ప్రభుత్వం తెలిపింది. వినేశ్ పొగట్ అనర్హత వెనుక కచ్చితంగా ఏదో కుట్ర ఉందని ఒలింపిక్ మెడలిస్ట్ విజేందర్ సింగ్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ 100 గ్రాముల్ని తగ్గించుకునేందుకు ఒలింపిక్ కమిటీ అవకాశం ఇచ్చి ఉండాలన్నారు. ‘ఇలాంటిది నేనెప్పుడూ చూడలేదు. భారత రెజ్లర్లపై ఏదో కుట్ర జరుగుతోంది. బహుశా కొంతమంది మన సంతోషాన్ని చూడలేకపోతున్నారేమో! ఒక రాత్రిలోనే ఐదారు కిలోలు తగ్గుతుంటాం. 100 గ్రాములకు సమస్యే ముంది?’ అని పేర్కొన్నారు.

మంగళవారం రాత్రి నాటికి వినేశ్ ఫొగట్ నిర్ణీత 50 కేజీల కన్నా 2 కేజీలు అదనపు బరువు ఉన్నారు. వెయిట్ తగ్గేందుకు ఆమె జాగింగ్, స్కిప్పింగ్, సైక్లింగ్ చేశారు. కోచ్, స్టాఫ్ ఏకంగా ఆమెలో కొంత రక్తాన్ని తొలగించారు. జుట్టు కత్తిరించారు. అయినా ఫలితం దక్కలేదు. ఈవెంట్ కు ముందు 100 గ్రా. బరువు అధికంగా ఉండటంతో అనర్హత వేటు పడింది. ఏ రంగంలోనైనా పైకి రావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. స్పోర్ట్స్ ఫిజికల్ ఫిట్నెస్ కోసం చాలా హార్డ్ వర్క్స్ చేయాలి. ఎన్నో ఏళ్లు కష్టపడ్డ తర్వాత చివరకు ఫలితం అనుకూలంగా రాకపోతే ఆ బాధ వర్ణనాతీతం. 2016 ఒలింపిక్స్లో గాయం వల్ల QFలోనే వైదొలిగిన వినేశ్ ఫొగట్, 2020లో QFలో ఓడారు. ఇప్పుడు ఫైనల్ చేరినా స్వల్ప అధిక బరువు వల్ల అనర్హత వేటు పడింది. ప్రస్తుతం వినేశ్ ఫొగట్ అస్వస్థతకు గురయ్యారు. బరువు తగ్గడానికి రాత్రంతా కఠోర సాధన చేసిన ఆమె, డీహైడ్రేషన్ కారణంగా ఆస్పత్రిలో చేరారు.

Read Also : NTR-Allu Arjun : ఒకే వేదికపై అల్లు అర్జున్ – ఎన్టీఆర్ లు ..?