Site icon HashtagU Telugu

Gift Of Thar : సర్ఫరాజ్ ఖాన్ తండ్రికి గిఫ్టుగా థార్.. ఆనంద్ మహీంద్రా గ్రేట్ !

Gift Of Thar

Gift Of Thar

Gift Of Thar : మహీంద్రా గ్రూప్ యజమాని ఆనంద్ మహీంద్రా మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు.  ఇచ్చిన మాటను నిలుపుకున్నారు. భారత క్రికెట్ జట్టు బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషాద్ ఖాన్‌కు థార్‌ను బహుమతిగా ఇచ్చారు. థార్ కారును నేరుగా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ ఇంటికి  ఆనంద్ మహీంద్రా  పంపారు. ఈ వాహనాన్ని సర్ఫరాజ్ తన తండ్రి నౌషాద్‌కు అందిస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్రీడాకారులను, వారి కుటుంబాలను ప్రోత్సహించేందుకు ఎంత ఖర్చుకైనా వెనుకాడని ఆనంద్ మహీంద్రాపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join

ఆనాడు మాట ఇచ్చిన మహీంద్రా..

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో మ్యాచ్ రాజ్‌కోట్ వేదికగా జరుగుతోంది. భారత జట్టు యువ స్టార్ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్‌కు ఈ మ్యాచ్ చాలా ప్రత్యేకమైనది. నిజానికి ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్‌కి టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం లభించింది. భారత జట్టులోకి రావడానికి సర్ఫరాజ్ ఖాన్ చాలా కాలంగా శ్రమిస్తున్నాడు. అతని విజయం వెనుక తండ్రి నౌషాద్ ఖాన్‌ ఉన్నారు. ఈ మ్యాచ్ ప్రారంభమైన సందర్భంగా నౌషాద్ చాలా ఎమోషనల్‌ అయ్యారు.

Also Read :Message From Jail : ఢిల్లీ నెక్ట్స్ సీఎం సునీతా కేజ్రీవాల్ ? ఇదేనా సంకేతం ?!

దీన్ని చూసిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సర్ఫరాజ్ తండ్రి కృషికి సెల్యూట్ చేశారు. నౌషాద్ ఖాన్‌ను ప్రశంసిస్తూ ఆనంద్ మహీంద్రా ఉద్వేగభరితమైన ట్వీట్‌ చేశారు. క్రికెటర్‌ సర్ఫరాజ్‌లో విశ్వాసాన్ని నింపింనందుకు అతని తల్లిదండ్రులను అభినందనల్లో ముంచెత్తారు. అనుకున్నది సాధించేంతవరకు నమ్మకాన్ని కోల్పోకూడదనే స్పూర్తినిచ్చారు అంటూ వారిని ప్రశంసించారు. వారికి థార్‌ను బహుమతిగా(Gift Of Thar) ఇస్తానని ఆనాడే వెల్లడించారు. భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ మెరుపు బ్యాటింగ్‌తో అరంగేట్రం చేశాడు. అతను తన మొదటి టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో 62 పరుగులు చేశాడు. సర్ఫరాజ్ 9 ఫోర్లు, 1 సిక్స్ బాదాడు. అయితే రవీంద్ర జడేజా చేసిన రాంగ్ కాల్ కారణంగా రనౌట్ అయ్యాడు.

Also Read :Good News For Prabhas Fans : మరోసారి జంటగా రాబోతున్న ప్రభాస్ – అనుష్క ..?