Site icon HashtagU Telugu

Andrew Symonds Doodle: ఆండ్రూ సైమండ్స్ కు అమూల్ ప్రత్యేక నివాళి…!!

Andrew

Andrew

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆండ్రూ సైమండ్స్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. 1998లో ఆస్ట్రేలియా తరపున వన్డే ఇంటర్నేషనల్ లో అరంగేట్రం చేసిన సైమండ్స్….దిగ్గజ ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన మరణం క్రీడా లోకంతోపాటు..తన అభిమానులను తీవ్రంగా కలచివేసింది. సైమండ్స్ ఆత్మకు శాంతిచేకూరాలని ప్రతిఒక్కరూ కోరుకున్నారు. ఇదిలా ఉండగా…ఆయన మృతికి ప్రముఖ డెయిరీ బ్రాండ్ అమూల్ ఇండియా వినూత్నం సంతాపం ప్రకటించింది. సైమండ్స్ కు నివాళులర్పిస్తూ…స్పెషల్ గా ఒక డూడుల్ ను డిజైన్ చేసింది. ఆ డూడుల్ తో అమూల్…ఆయన నివాళులర్పించింది. ఆ డూడుల్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

198 వన్డేలు ఆడిన సైమండ్స్…2003,2007 ప్రపంచ కప్ ను ఆస్ట్రేలియా గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. సైమండ్స్ మృతి పట్లు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు, ఐసీసీ, ఆసీస్ ఆటగాళ్లు ఆడమ్ గిల్ క్రి్ట్, గిల్లెస్పీ, న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ ఫ్లెమింగ్, పాకిస్తాన్ మాజీ క్రికెట్ షోయబ్ అక్టర్, భారత మాజీ క్రికెట్ వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్టర్ ద్వారా తమ సంతాపాన్ని ప్రకటించారు