Amit Mishra: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మ‌రో టీమిండియా క్రికెట‌ర్‌!

ఏఎన్ఐతో మాట్లాడిన అమిత్ మిశ్రా.. "నా కెరీర్‌లో నేను అరంగేట్రం చేసిన తర్వాత ఐదేళ్ల గ్యాప్ వచ్చింది. నాకు ఈ ఒక్క విషయంపై మాత్రమే బాధ ఉంది" అని అన్నారు.

Published By: HashtagU Telugu Desk
Amit Mishra

Amit Mishra

Amit Mishra: టీమిండియా మాజీ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా (Amit Mishra) అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలికారు. గురువారం తన సోషల్ మీడియాలో ఒక పెద్ద పోస్ట్ రాస్తూ ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అమిత్ మిశ్రా తన మనసులోని బాధను బయటపెట్టారు.

ఐదేళ్లు జట్టుకు దూరమవడంపై అమిత్ మిశ్రా బాధ

ఏఎన్ఐతో మాట్లాడిన అమిత్ మిశ్రా.. “నా కెరీర్‌లో నేను అరంగేట్రం చేసిన తర్వాత ఐదేళ్ల గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ రాకపోయి ఉంటే నేను మరిన్ని మ్యాచ్‌లు ఆడేవాడిని. నేను 2003లో బంగ్లాదేశ్‌పై వన్డేల్లో అరంగేట్రం చేశాను. ఆ తర్వాత ఐదేళ్లపాటు నాకు జట్టులో చోటు దక్కలేదు. ఐదేళ్లపాటు భారత జట్టులో మళ్లీ చేరలేకపోయాను. నేను మంచి ప్రదర్శన ఇస్తూనే వ‌చ్చాను. కానీ నాకు అవకాశం రాలేదు. అయితే దీనిపై నాకు ఎలాంటి బాధ లేదు. కేవలం రెండేళ్లు లేదా మూడేళ్ల‌లో నేను తిరిగి జట్టులోకి వచ్చుంటే, మరిన్ని మ్యాచ్‌లు ఆడి మరింత మెరుగ్గా రాణించేవాడిని. నాకు ఈ ఒక్క విషయంపై మాత్రమే బాధ ఉంది” అని అన్నారు.

Also Read: Amazon Paisa Vasool : అమెజాన్ నుండి బంపర్ క్యాష్‌బ్యాక్ ఆఫర్.. ‘పైసా వసూల్’ డీల్

డిప్రెషన్‌లోకి వెళ్లిన అమిత్ మిశ్రా

ఒకానొక సమయంలో తాను డిప్రెషన్‌కు గురయ్యానని అమిత్ మిశ్రా అంగీకరించారు. “అవును అది జరిగింది. కానీ దానిపై నాకు ఎలాంటి బాధ లేదు. నాకు ఎప్పుడు అవకాశం వచ్చినా నేను నా వంద శాతం ఇచ్చాను. నేను ఎల్లప్పుడూ మంచి ప్రదర్శన ఇవ్వడంపైనే దృష్టి పెట్టాను. నేను ఒక సంవత్సరం నుండి ఒకటిన్నర సంవత్సరాల వరకు డిప్రెషన్‌లో ఉన్నాను. నాకు చాలా కోపం వచ్చింది. నేను మంచి ప్రదర్శన చేస్తున్నప్పటికీ, నా పరిధి చాలా తక్కువగా ఉండేది. అయితే ఒకటి-రెండు సంవత్సరాల తర్వాత నేను నాతో నేను మాట్లాడుకోవడం మొదలుపెట్టాను. నేను క్రికెట్ ఆడాలి. నా క్రికెట్‌ను ఎలా మెరుగుపరుచుకోవాలి? దీనికి ఇంకా ఏ నైపుణ్యాలు జోడించవచ్చని ఆలోచించడం మొదలుపెట్టాను. అప్పుడే నాకు అర్థమైంది క్రికెట్‌ను ప్రేమించే వ్యక్తి డిప్రెషన్‌లో ఉండలేడు” అని అన్నారు. అమిత్ మిశ్రా టీమిండియా తరపున మొత్తం 68 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు.

  • టెస్ట్ మ్యాచ్‌లు: 22
  • వన్డే మ్యాచ్‌లు: 36
  • టీ20 మ్యాచ్‌లు: 10

 

  Last Updated: 04 Sep 2025, 07:03 PM IST