Site icon HashtagU Telugu

విడాకుల గురించి అడగొద్దు… షోయబ్ మాలిక్ రిక్వెస్ట్!

Shaib

Shaib

భారత టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. పలు సందర్భాల్లో సానియా పెట్టిన పోస్టులు కూడా ఈ వార్తలకు బలం చేకూర్చాయి. తాజాగా ఈ విడాకుల అంశానికి సంబంధించి మాలిక్ స్పందించిన తీరుతో సానియా-షోయబ్ విడిపోవడం ఖాయమని తేలిపోయింది. ఓ న్యూస్‌ ఏజెన్సీతో మాట్లాడుతూ.. విడాకుల అంశం తమ వ్యక్తిగతమని..దీనిని ఇక్కడితో వదిలేయాలని మీడియాను, అభిమానులను కోరాడు.

ఈ అంశంపై ఎలాంటి ప్రశ్నలు అడగొద్దని మీడియాకు విజ్ఞప్తి చేశాడు. విడాకులపై లేవనెత్తుతున్న ప్రశ్నలకు సానియా మీర్జా కూడా ఎలాంటి సమాధానం చెప్పబోదని మాలిక్ స్పష్టం చేశాడు. ఇది పూర్తిగా తమ వ్యక్తిగత వ్యవహారమనీ, నేను కానీ తనసతీమణి గానీ ఈ విడాకుల వార్తలపై సమాధానం చెప్పదనీ, తమను వదిలేయమన్నాడు. ఇదిలా ఉంటే వీరిద్దరి మధ్య విడాకుల అంశం ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది.

వివిధ షోలు, కార్యక్రమాల కోసం ఇప్పటికే కొన్ని ఒప్పందాలు చేసుకోవడంతోపాటు, న్యాయపరమైన సమస్యల కారణంగా ఈ జంట విడాకుల నిర్ణయాన్ని కొన్నాళ్లు వాయిదా వేసినట్లు సమాచారం. అవన్నీ తొలగిన తర్వాత అధికారిక ప్రకటన చేస్తారని వీరి సన్నిహితులు చెబుతున్నారు. విడిపోయిన తర్వాత తనయుడు ఇజాన్‌ సంరక్షణ బాధ్యతలను ఇద్దరూ చూసుకుంటారని తెలుస్తోంది. కాగా ఓ పాక్ మోడల్‌తో షోయబ్ మాలిక్ సన్నిహితంగా ఉండడమే విడాకులకు కారణమని తెలుస్తోంది. కొన్నాళ్ల క్రితం షోయబ్‌ మాలిక్‌కు సదరు మోడల్‌తో పరిచయమైందని, తర్వాత ఆమెతో చనువుగా ఉండడం సానియాకు నచ్చకపోవడంతో మనస్పర్థలు వచ్చినట్టు అర్థమవుతోంది. ఇదిలా ఉంటే తాజాగా షోయబ్ మాలిక్ సానియాతో కలిసి చేసిన ఓ ఓ టీవీ టాక్ షో‌ ప్రోమోను ఇన్ స్టాలో షేర్ చేశాడు. ఉర్దూ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో వచ్చే ఈ షోకు ‘ది మీర్జా మాలిక్ షో’ అని పేరు పెట్టారు.

Exit mobile version