భారత క్రికెట్ టీమిండియా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ విడాకులు తీసుకోనున్నాడా? అంటూ కథనాలు వస్తున్నాయి.
చహల్, భార్య ధనశ్రీ ఇద్దరి సోషల్ మీడియా పోస్టులే ఈ కథనాలకు కారణమయ్యాయి. కొత్త జీవితం ప్రారంభం కానుంది అంటూ చహల్ పోస్టు చేయగా, తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి చహల్ పేరును తొలగించి ధనశ్రీ పుకార్లకు అవకాశమిచ్చింది. తన పేరును ధనశ్రీ వర్మగా మార్చుకుంది. దాంతో గందరగోళం ఏర్పడింది.
2020లో ధనశ్రీని పెళ్లి చేసుకొని..
2020లో చహల్ దంతవైద్యురాలు ధనశ్రీని పెళ్లి చేసుకున్నాడు. ధనశ్రీ డెంటిస్ట్ మాత్రమే కాదు యూట్యూబర్, కొరియోగ్రాఫర్ కూడా. పెళ్లికి ముందు వీరిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లయిన తర్వాత సోషల్ మీడియాలో ఈ జంట అల్లరి అంతా ఇంతా కాదు. ఈ జంట విడిపోనుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై చహల్ స్పందించాడు. తమ వైవాహిక బంధంపై వస్తున్నవన్నీ పుకార్లేనని.. వాటిని ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశాడు. వాటికి ఇంతటితో ముగింపు పలకాలని కోరాడు. ప్రతి ఒక్కరి జీవితం ప్రేమతో వెలిగిపోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపాడు. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు.