Site icon HashtagU Telugu

Ashwin IPL Earned: అశ్విన్ ఐపీఎల్ సంపాద‌న ఎంతో తెలుసా.. దాదాపు రూ. 100 కోట్లు!

Ashwin IPL Earned

Ashwin IPL Earned

Ashwin IPL Earned: రవిచంద్రన్ అశ్విన్‌ ఐపీఎల్‌ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. 18 ఏళ్లుగా లీగ్ ఆడుతున్న ఆయన తన కెరీర్ గురించి పెద్ద నిర్ణయం తీసుకున్నారు. 2025 ఐపీఎల్‌లో అశ్విన్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడారు. ఇదే ఆయనకు చివరి సీజన్. ఇన్నేళ్లలో అశ్విన్ ఐపీఎల్ నుంచి కోట్లు సంపాదించారు. ఆయన మొత్తం ఆదాయం (Ashwin IPL Earned) చూస్తే మీరు షాక్ అవుతారు.

ఐపీఎల్‌ నుంచి ఆర్ అశ్విన్ ఎంత సంపాదించారు?

ఆర్ అశ్విన్ 2009లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అరంగేట్రం చేశారు. 2008లో చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని కొనుగోలు చేసినా ఆడే అవకాశం రాలేదు. సూపర్ కింగ్స్‌తో పాటు రైజింగ్ పూణె సూపర్ జెయింట్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆయన ఐపీఎల్ ఆడారు. ఈ క్రమంలో కోట్లాది రూపాయలు సంపాదించారు. గత ఏడాది తన ఐపీఎల్ కెరీర్‌లో ఒక సీజన్‌లో అత్యధిక డబ్బు అందుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని రూ.9.75 కోట్లకు తీసుకుంది. కింద ఆయన ఐపీఎల్‌లో ఏడాది వారీగా అందుకున్న జీతం వివరాలు ఉన్నాయి.

Also Read: BJP : నన్ను 11 ఏళ్లుగా ఫుట్‌బాల్‌లా ఆడుకున్నారు: రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

అశ్విన్ ఐపీఎల్ సంపాద‌న‌

మొత్తం ఆదాయం: రూ. 97.24 కోట్లు

ఐపీఎల్‌లో అశ్విన్ ప్రదర్శన

ఐపీఎల్‌లో తన 17 ఏళ్ల కెరీర్‌లో అశ్విన్ 221 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 187 వికెట్లు పడగొట్టి, 30.22 సగటుతో రాణించాడు. అశ్విన్ 7.20 అద్భుతమైన ఎకానమీతో బౌలింగ్ చేశాడు. కేవలం ఒకేసారి 4 వికెట్ల హాల్ నమోదు చేశాడు. బ్యాటింగ్‌లో అశ్విన్ 98 ఇన్నింగ్స్‌లలో 833 పరుగులు చేశాడు. ఇందులో 34 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. ఐపీఎల్‌లో అతడికి ఒక అర్ధ శతకం కూడా ఉంది.