ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun).. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner)పుట్టిన రోజు సందర్బంగా శుభాకాంక్షలు తెలిపాడు. నేడు డేవిడ్ వార్నర్ 37 వ పుట్టిన రోజు (David Warner Birthday). ఈ సందర్బంగా క్రికెట్ అభిమానులతో పాటు స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ విషెష్ అందించడం మరింతగా ఆకట్టుకుంటుంది. అల్లు అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా వార్నర్ కు విష్ చేశాడు. ఈ సందర్భంగా అతన్ని క్రికెట్ సూపర్ స్టార్ గా అర్జున్ అభివర్ణించడం విశేషం.
We’re now on WhatsApp. Click to Join.
ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (SunRisers Hyderabad) జట్టుకు ఆడడం వల్ల టాలీవుడ్ సినిమాలపై వార్నర్ కు విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. ముఖ్యంగా బన్నీ అంటే వార్నర్ కు ఎనలేని అభిమానం. బన్నీ సినిమాలన్నా, అతడి సినిమాల విశేషాలన్నా వార్నర్ కు చాలా ఇష్టం. వార్నర్ సోషల్ మీడియా ఖాతాలో చూస్తే పుష్పతో పాటు అల్లు అర్జున్ ఇతర చిత్రాల స్పూఫ్ వీడియోలే ఎక్కువగా దర్శనమిస్తాయి. ఈ వరల్డ్ కప్ లో సెంచరీ చేసిన ప్రతిసారీ వార్నర్ తగ్గేదే లే అంటూ గడ్డం కిందికి చేయి పోనివ్వడం చేస్తూ వచ్చాడు. ఇలా ఎప్పటికప్పుడు అల్లు అర్జున్ ను వాడుకుంటూ వస్తుండడం తో బన్నీ అభిమానులు సైతం వార్నర్ కు వీరాభిమానులుగా మారారు.
అల్లు అర్జున్ పుట్టిన రోజు నాడు కూడా వార్నర్ ప్రత్యేకంగా విషెష్ అందించాడు. ‘బిగ్ షౌటౌట్.. బిగ్ మ్యాన్ అల్లు అర్జున్.. హ్యపీ బర్త్ డే మేట్’ అంటూ.. బన్నీకి వార్నర్ జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన వార్నర్.. పుష్ప-2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని అన్నాడు. హ్యాపీ బర్త్ డే పుష్పా.. అంటూ వార్నర్ కూతురు ఇస్లా సైతం బన్నీకి బర్త్ డే విషెస్ తెలిపింది. ఈ వీడియోను వార్నర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఇలా ఇద్దరు ఒకరికారు విషెష్ చెప్పుకోవడం ఇరు అభిమానులను ఆకట్టుకుంటుంది.
Read Also : Chandrababu : చంద్రబాబు లెటర్ తో మరింత ఆందోళనకు గురవుతున్న కుటుంబ సభ్యులు
