Site icon HashtagU Telugu

2023 Asian Games: సెప్టెంబర్ 23 నుంచి ఆసియా క్రీడలు.. క్రికెట్ షెడ్యూల్ ఇదే..!

2023 Asian Games

Compressjpeg.online 1280x720 Image 11zon

2023 Asian Games: ఆసియా క్రీడలు 2023 (2023 Asian Games) చైనాలోని హాంగ్‌జౌ నగరంలో నిర్వహించనున్నారు. అయితే దీని షెడ్యూల్‌ను ప్రకటించారు. వాస్తవానికి హాంగ్‌జౌలో ఆసియా క్రీడలు 2022 జరగాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ కారణంగా నిర్వహించలేకపోయింది. ఈ ఏడాది హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో 40 క్రీడాంశాల్లో మొత్తం 61 పోటీలు జరగనున్నాయి. హాంగ్‌జౌ కాకుండా మరో 5 నగరాల్లో క్రీడలు నిర్వహించనున్నారు. అదే సమయంలో ఈ ఆసియా క్రీడలు 16 రోజుల పాటు కొనసాగుతాయి.

షెడ్యూల్ ప్రకారం ఆసియా క్రీడల్లో చాలా మ్యాచ్‌లు సెప్టెంబర్ 23న ప్రారంభం కానున్నాయి. దీంతోపాటు ఆసియా క్రీడల ప్రారంభోత్సవం కూడా ఇదే రోజు జరగనుంది. క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్, బీచ్ వాలీబాల్ వంటి క్రీడల మ్యాచ్‌లు కూడా జరగనున్నాయి. ఈ ఆసియా క్రీడల ముగింపు వేడుక అక్టోబర్ 8న జరగనుంది.

సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకూ జరిగే ఈ పోటీలలో భారత అథ్లెట్లు, ఇతర క్రీడలతో పాటు క్రికెటర్లు కూడా పాల్గొంటున్నారు. గతంలో పలుమార్లు ఆసియా క్రీడల్లో క్రికెట్‌ను ఆడించినా ఈ పోటీలలో భారత్ పాల్గొనలేదు. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో బీసీసీఐ.. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని ద్వితీయ శ్రేణి భారత జట్టును బరిలోకి దింపుతోంది.

Also Read: Theekshana Ruled Out: ఆసియా కప్ ఫైనల్ కు ముందు శ్రీలంక జట్టుకు భారీ ఎదురుదెబ్బ

టీ20 ఫార్మాట్‌లో జరుగబోయే ఆసియా క్రీడల మ్యాచ్‌లు సెప్టెంబర్ 27న మొదలవుతాయి. 14 జట్లు పాల్గొంటున్న ఈ ఈవెంట్‌లో ర్యాంకుల ఆధారంగా ఇదివరకే భారత్, పాకిస్తాన్, శ్రీంక, బంగ్లాదేశ్‌లు క్వార్టర్స్‌కు అర్హత సాధించాయి. నేపాల్, మంగోలియా, జపాన్, కంబోడియా, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, మాల్దీవ్స్, హాంకాంగ్, జపాన్‌లు లీగ్ స్టేజ్ లో తలపడతాయి. ఇందులో నాలుగు జట్లు క్వార్ట్స్‌కు అర్హత సాధిస్తాయి. ఈ ఈవెంట్‌లో మొత్తం 17 మ్యాచ్‌లు జరుగుతాయి.

భారత్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 03న ఫింగ్‌ఫెంగ్ క్రికెట్ ఫీల్డ్‌లో క్వార్టర్స్‌కు గ్రూప్ – ఎ నుంచి అర్హత సాధించే తొలి జట్టుతో ఆడనుంది. అక్టోబర్ 6న రెండు సెమీఫైనల్స్, ఏడో తేదీన మూడో స్థానం కోసం జరిగే జట్టు తలపడనుండగా అదే రోజు ఫైనల్ జరుగుతుంది.

మహిళల క్రికెట్‌లో మొత్తం 11 మ్యాచ్‌లు జరుగుతాయి. గ్రూప్ – ఎ నుంచి ఇండోనేషియా, మంగోలియా.. గ్రూప్ – బి నుంచి హాంకాంగ్, మలేషియాలు లీగ్ దశలో తలపడతాయి. ర్యాంకుల ఆధారంగా భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు క్వార్టర్స్ పోరుకు అర్హత సాధించాయి. గ్రూప్ – ఎ నుంచి అగ్రస్థానంలో ఉన్న జట్టుతో భారత్ సెప్టెంబర్ 21న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. 24న రెండు సెమీస్‌లు, 25న మూడో స్థానం కోసం పోటీ పడే జట్టు మ్యాచ్‌లు ఆడతాయి. అదే రోజు ఫైనల్ జరుగుతుంది.