Site icon HashtagU Telugu

T20 Team : రోహిత్ , కోహ్లీలపైనే అందరి చూపు.. ఆప్ఘనిస్తాన్ తో తొలి టీ ట్వంటీకి తుది జట్టు ఇదే..

Rohit- Kohli Retirement

Rohit- Kohli Retirement

IND vs AFG T20 Team : సౌతాఫ్రికాపై టెస్ట్ విజయంతో కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించిన భారత్ సొంతగడ్డపై టీ ట్వంటీ సిరీస్ కు సిద్ధమైంది. గురువారం నుంచి ఆప్ఘనిస్తాన్ తో మూడు మ్యాచ్ ల సిరీస్ ఆడబోతోంది. జూన్‌లో T20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఈ సిరీస్‌కు ప్రాధాన్యత నెలకొంది. మెగా టోర్నీకి ముందు టీమిండియా ఆడే ఏకైక T20 సిరీస్ ఇదే. దీంతో ప్రత్యర్థి అఫ్గానిస్థాన్ చిన్న జట్టే అయినా భారత్ తేలిగ్గా తీసుకోవడం లేదు. 14 నెలలుగా పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇస్తున్నారు. టీ ట్వంటీ వరల్డ్ కప్ జట్టులో వీరిద్దరికీ చోటు దక్కనుందన్న అంచనాల మధ్య ఎలా ఆడతారనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది.

We’re Now on WhatsApp. Click to Join.

పొట్ట ఫార్మాట్ లో రోహిత్ , కోహ్లీ ఇద్దరూ ఇద్దరే..అయినప్పటకీ ఈ సిరీస్ లో సత్తా చాటడం వీరిద్దరికీ కీలకమే. వీరిద్దరి ఎంట్రీతో తుది జట్టులో మార్పులు చోటు చేసుకోనున్నాయి. మొహాలీ వేదికగా జరిగే తొలి టీ20లో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్ బరిలోకి దిగే అవకాశం ఉంది. లెఫ్ట్ రైట్ కాంబినేషన్‌తో పాటు తొలి బంతి నుంచే హిట్టింగ్ చేయగల సామర్థ్యం యశస్వీకి ఉండటంతో శుభ్‌మన్ గిల్‌కు బదులు అతన్ని ఓపెనర్‌గా ఆడించే అవకాశం ఉంది.

ఫస్ట్ డౌన్‌లో విరాట్ కోహ్లీ ఆడనుండగా.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్‌తో పాటు తిలక్ వర్మ, శివమ్ దూబేల్లో ఒకరు ఆడే ఛాన్స్ ఉంది. ఆల్‌రౌండర్‌కు ప్రాధాన్యత ఇస్తే శివమ్ దూబే జట్టులోకి వస్తాడు. గత కొన్నాళ్లుగా T20 జట్టులో వరుసగా అవకాశాలు అందుకుంటున్న తిలక్ వర్మను ఆడించాలనుకుంటే మాత్రం దూబే బెంచ్ కే పరిమితమవుతాడు. ఐదో స్థానంలో రింకూ సింగ్ ఆడటం ఖాయం కాగా.. వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్ , జితేశ్ శర్మ రేసులో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్.. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ కు చోటు ఖాయంగా కనిపిస్తోంది. సౌతాఫ్రికా పర్యటనలో అక్షర్ పటేల్ విఫలమైనా.. కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లతో సత్తా చాటాడు. ఇక బూమ్రా , సిరాజ్ లకు విశ్రాంతినివ్వడంతో అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, ముఖేశ్ కుమార్‌ పేస్ భారాన్ని మోయనున్నారు.

Also Read:  ICC Test Ranking: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన కోహ్లీ, రోహిత్..!