US Open:స్పెయిన్ యువ సంచలనానిదే యూఎస్ ఓపెన్

స్పెయిన్ టెన్నిస్ సంచలనం కార్లోస్ అల్కరాజ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అతి చిన్న వయసులో గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన ఆటగాడిగా నిలిచాడు.

  • Written By:
  • Publish Date - September 12, 2022 / 11:34 AM IST

స్పెయిన్ టెన్నిస్ సంచలనం కార్లోస్ అల్కరాజ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అతి చిన్న వయసులో గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన ఆటగాడిగా నిలిచాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో అల్కరాజ్ 6-4, 2-6. 7-6(7-1), 6-3 తేడాతో కాస్పర్ రూడ్‌ పై గెలుపొందాడు. అంచనాలు లేకుండా అడుగుపెట్టిన వీరిద్దరికీ ఇదే తొలి గ్రాండ్ స్లామ్ ఫైనల్. అయితే ఆరంభం నుంచే నువ్వా నేనా అన్నట్టు తలపడ్డారు. క్వార్టర్ ఫైనల్, సెమీస్ లలో మారథాన్ మ్యాచ్ లు ఆడిన అల్కరాజ్ తుది పోరులోనూ అదరగొట్టాడు. మూడున్నర గంటలపాటు సాగిన ఈ పోరులో అల్కరాజ్ దే పై చేయిగా నిలిచింది. తొలి సెట్ ను గెలిచినా ..తర్వాత రూడ్ కూడా పుంజుకుని స్కోర్ సమం చేశాడు. ఇక మూడో సెట్ కూడా ఉత్కంఠ భరితంగా సాగింది. ఇద్దరూ సర్వీస్ నిలుపుకోవడంతో టై బ్రేక్ తప్పలేదు. టై బ్రేక్ లో
అల్కరాజ్ దూకుడుగా ఆడి గెలుచుకుని ఆధిక్యంలో నిలిచాడు. నాలుగో సెట్ లో రూడ్ చేతులెత్తేశాడు. దీంతో అల్కరాజ్  తన ఆధిక్యాన్ని  నిలుపుకుంటూ 6-3 తేడాతో గెలిచిన తొలిసారి యూఎస్ ఓపెన్ ను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో పలు రికార్డులు నెలకొల్పాడు. నాదల్ తర్వాత చిన్న వయస్సులో యూఎస్ సాధించిన ఆటగాడిగా ఘనత సాధించాడు. స్పెయిన్ కే చెందిన దిగ్గజ ఆటగాడు రఫెల్ నాదల్ 2005లో 19 యేళ్లు వయసు ఆటగాడిగా తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించాడు. అప్పటి నుంచి ఆ రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేరు. తాజాగా అల్కరాజ్ ఆ రికార్డును సమం చేయడంతో పాటు 19 ఏళ్ల వయసులోనే ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ ను సొంతం చేసుకున్న తొలి అల్కరాజ్ నిలిచాడు. మరోవైపు తొలి గ్రాండ్ స్లామ్ అందుకోవాలని అనుకున్న రూడ్ కల నెరవేరలేదు.ఇప్పటికే ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన అతను.. తాజాగా జరిగిన యూఎస్‌ ఓపెన్‌ 2022లో ఫైనల్లోనూ ఓడిపోయాడు.