Site icon HashtagU Telugu

WTC Final 2023: నిన్ను చివరివరకూ ప్రేమిస్తూనే ఉంటాను…రహానే వైఫ్ పోస్ట్ వైరల్..

WTC Final 2023

5c562d6e F29b 4274 90a7 93a256c88869

WTC Final 2023: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో చివరి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 469 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా తరఫున అజింక్య రహానే అద్భుత ప్రదర్శన చేశాడు. 18 నెలల తర్వాత టెస్టు జట్టులోకి తిరిగి వచ్చిన అజింక్య రహానే తన తొలి ఇన్నింగ్స్‌లో వేలికి గాయమైంది. అయినప్పటికీ అతను అద్భుతంగ ఆడాడు. ఆ ఇన్నింగ్స్ లో రహానే 89 పరుగులతో ఆకట్టుకున్నాడు. రహానే శార్దూల్ ఠాకూర్‌తో కలిసి 7వ వికెట్‌కు 109 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రహానే గాయంతోనే బ్యాటింగ్ చేయడంతో రహానే స్ఫూర్తిని తోటి ఆటగాళ్లు, అభిమానులే కాదు, అతని భార్య రాధా రహానే కూడా ప్రశంసించారు.

మొదటి ఇన్నింగ్స్‌లో పాట్ కమిన్స్ నుండి వచ్చిన బంతి నేరుగా అజింక్య రహానే బొటనవేలుకు బలంగా తాకింది. అయినప్పటికీ నొప్పితో పోరాడాడు. దీంతో అతని స్ఫూర్తిని టీమిండియా సహచర ఆటగాళ్లు మెచ్చుకోవడమే కాకుండా అతని భార్య రాధికా కూడా అతనికి సెల్యూట్ చేశారు. రహానే ఈ ఇన్నింగ్స్‌కు సంబంధించి అతని భార్య రాధికా ధోపావ్కర్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో దానికి సంబంధించిన చిత్రాలను పంచుకున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో రహానే ఇన్నింగ్స్ ఆడారని ప్రశంసించారు. గాయపడిన బొటనవేలుతో రహానే చిత్రాన్ని పోస్ట్ చేస్తూ ఇలా రాసింది.

‘మీ వేలు వాచిపోయింది. ఆ గాయం మిమ్మల్ని అడ్డుకోలేదు. అందుకే స్కాన్ చేయడానికి నిరాకరించారు. నీ ఈ స్పిరిట్‌ని చూసి అందరూ ఇంప్రెస్ అయ్యారు. నిన్ను ఎప్పటికి ప్రేమిస్తాను అంటూ రహానే సతీమణి తన ప్రేమను వ్యక్తపరిచింది.

Read More: Samantha: సెర్బియా క్లబ్‌లో సమంత జోరు.. బీరు బాటిల్ పట్టుకొని, ఊ అంటావా పాటతో దుమ్మురేపి!