Site icon HashtagU Telugu

WTC Final 2023: టెస్టు క్రెడిట్ అంతా ధోనీదే: అజింక్య రహానే

WTC Final 2023

Ajinkya Rahane

WTC Final 2023: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చివరి మ్యాచ్‌లో భారత టెస్టు మాజీ వైస్ కెప్టెన్ అజింక్యా రహానే అద్భుతంగా పునరాగమనం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాపై క్లాస్ ఆటతో చెలరేగిపోయాడు. ఇదిలా ఉండగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి కంగారూ జట్టుదే పైచేయిగా కనిపించింది. ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం రహానే మీడియా పాయింట్ వద్ద తన అనుభవాలను షేర్ చేసుకున్నాడు. మహేంద్ర సింగ్ ధోనీకి క్రెడిట్ మొత్తం ఇచ్చాడు.

నిజానికి WTC ఫైనల్ 2023లో ఆస్ట్రేలియా 469 పరుగులు చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన అజింక్య రహానే 89 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. శార్దూల్ ఠాకూర్ (51)తో కలిసి 7వ వికెట్‌కు 109 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో భారత జట్టుకు బలం చేకూరి 296 పరుగులు చేయగలిగింది. గాయం బాధిస్తున్నా అద్భుతమైన ఆటతో జట్టుకు మంచి స్కోర్ అందించాడు అజింక్య రహానే.

రహానే మాట్లాడుతూ.. నా ఈ అద్భుతమైన ఆటతీరుకు క్రెడిట్‌ ఎంఎస్‌ ధోనీకే అందజేస్తానని చెప్పాడు. నాపై నమ్మకం ఉంచి నా ఆత్మవిశ్వాసాన్ని గుర్తించి, సీఎస్‌కే తరఫున ఆడే అవకాశం కల్పించిన ఘనత ధోనీదే అని చెప్పారు. తనకు అయిన గాయం బ్యాటింగ్‌పై ఎలాంటి ప్రభావం చూపదని రహానే ఈ సందర్భంగా తెలిపాడు. అలాగే మంచి ప్రదర్శన ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు రహానే.

Read More: WTC Final 2023: ఫాలో ఆన్ తప్పినా ఆసీస్ దే పై చేయి