Site icon HashtagU Telugu

Rohit Sharma: ఇది నిజంగా క‌ల‌వ‌ర‌పెట్టే వార్త‌.. విమాన ఘ‌ట‌న‌పై రోహిత్ శ‌ర్మ ఎమోష‌న‌ల్‌!

Rohit Sharma

Rohit Sharma

Rohit Sharma: భారత క్రికెటర్ రోహిత్ శర్మ అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ఘ‌ట‌న‌పై విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో రోహిత్ శర్మ (Rohit Sharma) విమాన ప్ర‌మాదం వల్ల ప్రభావితమైన అందరి పట్ల తన సానుభూతిని తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 30 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మకు ముందు ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, హర్భజన్ సింగ్‌తో సహా అనేక మంది క్రికెటర్లు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు.

రోహిత్ శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్టోరీ షేర్ చేశారు. అందులో ఆయన ఇలా రాశారు. అహ్మదాబాద్ నుండి చాలా దుఖకరమైన, కలవరపెట్టే వార్త వచ్చింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను అని రాసుకొచ్చారు.

Also Read: Air india Flight Crash : విమాన ప్రమాదంలో చాలా మంది ప్రయాణికులు మరణించారు: విదేశాంగ శాఖ ప్రకటన

పాండ్యా విచారం

అహ్మదాబాద్ నుండి లండన్‌కు వెళుతున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూలిపోయింది. ఈ సంఘటనపై భారత క్రికెటర్ హార్దిక్ పాండ్య చేతులు జోడించి భావోద్వేగంతో స్పందించాడు. హార్దిక్ ప్రతిస్పందన ఈ వార్త తనను తీవ్రంగా కలచివేసిందని తెలియజేస్తోంది. అహ్మదాబాద్‌లో జరిగిన ప్రమాదం గురించి విని హృదయ విదారకంగా ఉంది. బాధిత కుటుంబాలకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను. భ‌గ‌వంతుడు వారికి బ‌లం చేకూర్చాల‌ని కోరుకుంటున్నాని పేర్కొన్నారు.

వార్త విని షాకైన‌ హర్భజన్ సింగ్

మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఈ ఘ‌ట‌న విని షాకైన‌ట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ఘ‌ట‌న వార్త‌తో నేను చాలా షాక్ అయ్యాను, బాధపడ్డాను. నా సానుభూతి, ప్రార్థనలు ఈ బాధను భరిస్తున్న బాధితులు, వారి కుటుంబాలతో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఘటన మాజీ క్రికెటర్‌కు పెద్ద షాక్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. దుర్ఘటన జరిగిన కొన్ని నిమిషాల్లోనే హర్భజన్ సింగ్ ఈ ఘ‌ట‌న‌పై స్పందించారు.

వీరితో పాటు దేశ‌, విదేశాల నుంచి ఉన్న‌తాధికారులు ఈ ఘ‌ట‌న‌పై విచారం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఎంత‌మంది మ‌ర‌ణించార‌నే ఖ‌చ్చిత‌మైన స‌మాచారం లేదు. విదేశాంగ శాఖ మాత్రం చాలా మంది ప్ర‌యాణికులు మ‌రణించిన‌ట్లు పేర్కొంది. మ‌రోవైపు ఈ ఘ‌ట‌న‌లో గుజ‌రాత్ మాజీ ముఖ్య‌మంత్రి కూడా మ‌ర‌ణించార‌ని వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి.