New Captain Of SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా సౌతాఫ్రికా క్రికెటర్

ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) తమ కొత్త కెప్టెన్ ను ప్రకటించింది. సౌతాఫ్రికా క్రికెటర్ ఐడెన్ మార్క్రమ్ (Aiden Markram)ను కెప్టెన్ గా గురువారం ప్రకటించింది.

Published By: HashtagU Telugu Desk
SRH

Resizeimagesize (1280 X 720) (1) 11zon

ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) తమ కొత్త కెప్టెన్ ను ప్రకటించింది. సౌతాఫ్రికా క్రికెటర్ ఐడెన్ మార్క్రమ్ (Aiden Markram)ను కెప్టెన్ గా
గురువారం ప్రకటించింది. ఇటీవల జరిగిన సౌతాఫ్రికా టీ20 క్రికెట్ లీగ్ లో విజేతగా నిలిచిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టుకు ఐడెన్ మార్క్రమ్ కెప్టెన్ గా వ్యవహరించాడు. దీంతో జట్టు యాజమాన్యం అతడిపై నమ్మకముంచి కెప్టెన్సీ పగ్గాలను అప్పజెప్పినట్లు అర్థమవుతోంది.

 

ఐపీఎల్ 2023కి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ గ్రాండ్ లీగ్ కోసం అన్ని జట్లు ఇప్పటికే సన్నద్ధమయ్యాయి. అయితే ఒకసారి ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకున్న ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ 2023కి కొత్త కెప్టెన్‌ని ప్రకటించింది. ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు రాబోయే సీజన్‌లో కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్ ఐడెన్ మార్క్రామ్ ఎంపికయ్యాడు. మార్చి 31 నుంచి ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్‌లో అతను జట్టుకు నాయకత్వం వహిస్తాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తన కొత్త కెప్టెన్‌ను ట్వీట్ చేస్తూ ప్రకటించింది. దక్షిణాఫ్రికా 20 లీగ్ మొదటి సీజన్‌లో మార్క్రామ్ నాయకత్వంలో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఛాంపియన్‌గా నిలిచింది.

Also Read: Women’s T20 World Cup: కంగారూలతో భారత్‌ ”సెమీతుమీ”..!

2016లో ఐపిఎల్ టైటిల్‌ను గెలుచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపిఎల్ 16 కోసం మినీ-వేలానికి ముందు రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను విడుదల చేసింది. ఆ తర్వాత మయాంక్ అగర్వాల్, ఐడెన్ మార్క్‌రామ్, భువనేశ్వర్ కుమార్ కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారు. అయినప్పటికీ, ఫ్రాంచైజీ మార్క్‌రామ్‌పై విశ్వాసం ఉంచింది. అతనికి జట్టు బాధ్యతలు తీసుకునే బాధ్యతను ఇచ్చింది. విలియమ్సన్ 2018లో వార్నర్ లేనప్పుడు ఆరెంజ్ ఆర్మీకి నాయకత్వం వహించాడు.

  Last Updated: 23 Feb 2023, 11:45 AM IST