IPL 2022: హార్దిక్ పాండ్యా , రషీద్ ఖాన్ జాక్ పాట్

ఐపీఎల్ 2022 సీజన్‌లోకి అధికారికంగా కొత్త ఫ్రాంఛైజీలు లక్నో, అహ్మదాబాద్ ఎంట్రీ ఇచాయి. ఈ సీజన్‌కి సంబంధించి ఆటగాళ్ల వేలం ఫిబ్రవరి 12, 13న బెంగళూరు వేదికగా జరగనుండగా..

  • Written By:
  • Publish Date - January 18, 2022 / 12:21 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లోకి అధికారికంగా కొత్త ఫ్రాంఛైజీలు లక్నో, అహ్మదాబాద్ ఎంట్రీ ఇచాయి. ఈ సీజన్‌కి సంబంధించి ఆటగాళ్ల వేలం ఫిబ్రవరి 12, 13న బెంగళూరు వేదికగా జరగనుండగా.. అప్పటిలోపు వేలానికి పాత ఫ్రాంఛైజీలు వదిలేసిన ఆటగాళ్లలో నుంచి ముగ్గురిని ఎంచుకునే వెసులబాటుని ఈ కొత్త ఫ్రాంఛైజీలకి బీసీసీఐ కల్పించింది. ఈ నేపద్యంలో అహ్మదాబాద్ ఫ్రాంచైజీ తమ ముగ్గురు ఆటగాళ్లను ప్రకటించింది. ఊహించినట్లుగానే స్టార్ ఆల్ రౌండర్ హర్ధిక్ పాండ్య ను భారీ ధరకు కొనుగోలు చేసింది. హార్ధిక్ కోసం 15 కోట్లు వెచ్చించింది. అలాగే స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ను కూడా 15 కోట్లకు , ఓపెనర్ శుబ్ మన్ గిల్ ను 7 కోట్లకు దక్కించుకుంది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఏ ఫ్రాంచైజీ అయినా ముగ్గురు ఆటగాళ్లను తీసుకుంటే 15 కోట్లు, 11 కోట్లు, 7 కోట్లు చెల్లిచాలి. ఈ క్రమంలోనే హార్థిక్ జాక్ పాట్ కొట్టేసినట్టు తెలుస్తోంది. తమ ఫ్రాంచైజీ కి హర్థిక్ ను సారథిగా నియమించాలని అహ్మదాబాద్ భావిస్తోంది.

మరోవైపు సన్ రైజర్స్ వేలంలోకి వదిలేసిన స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కోసం ముందు నుంచే ప్రయత్నించిన అహ్మదాబాద్ చివరికి అతన్ని దక్కించుకుంది. సెకండ్ ఛాయిస్ ప్లేయర్‌గా రషీద్ ఖాన్‌‌ని ఎంచుకున్న అహ్మదాబాద్ ఈ క్రమంలో అతనికి 11 కోట్లు చెల్లించాల్సి ఉండగా మరో 4 కోట్లు ఎక్కువగా ఇవ్వనుంది. ఐపీఎల్ 2021 సీజన్‌‌కి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ రషీద్ ఖాన్‌కి 9 కోట్లు మాత్రమే ఇచ్చింది. దీంతో ఈ సారి రషీద్ ఖాన్ మరో 6 కోట్లు ఎక్కువగా అందుకోనున్నాడు.

ఇక ఇండియన్ క్రికెట్ లో సత్తా చాటుతున్న కుర్రాళ్లలో శుభ్‌మన్ గిల్ ఒకడు. గత కొన్ని సీజన్ లుగా ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తరపున అదరగొడుతున్నాడు. ఆ ఫ్రాంచైజీ గిల్ ను వేలంలో వదిలేయడంతో అహ్మదాబాద్ 7 కోట్లు చెల్లించి దక్కించుకుంది. టాప్ ఆర్డర్ లో పిల్లర్ లాంటి ప్లేయర్ గిల్ కొత్త ఫ్రాంచైజీ కి కీలకం కానున్నాడు. అహ్మదాబాద్ ఫ్రాంచైజీని దక్కించుకున్న సీవీసీ క్యాపిటల్ ఇప్పటికే జట్టు కోచ్‌గా టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా, హెడ్ కోచ్‌గా సౌతాఫ్రికా దిగ్గజ ప్లేయర్ గ్యారీ కిర్‌స్టన్, టీమ్‌ డైరక్టర్‌గా ఇంగ్లండ్ మాజీ బ్యాట్స్‌మన్ విక్రమ్ సోలంకీని నియమించింది.