Sanju Samson: సంజూ శాంసన్ (Sanju Samson) వ్యక్తిగత కారణాల వల్ల డిసెంబర్‌లో వయనాడ్‌లో జరిగే కేరళ మూడు రోజుల విజయ్ హజారే ట్రోఫీ ప్రాక్టీస్ క్యాంప్‌కు దూరం కానున్నాడు. దీంతో కేరళ క్రికెట్ అసోసియేషన్ అతడిని విజయ్ హజారే ట్రోఫీ నుంచి తప్పించింది. కాగా విజయ్ హజారే ట్రోఫీ నుంచి వైదొలగాలని శాంసన్ తీసుకున్న నిర్ణయం బీసీసీఐ అధికారులకు, సెలక్టర్లకు నచ్చలేదని సమాచారం.
బీసీసీఐ కీలక అడుగు
టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. 16 ODIలు, 37 T20 ఇంటర్నేషనల్స్ ఆడిన సంజూ శాంసన్ విజయ్ హజారే ట్రోఫీలో ఎందుకు పాల్గొనలేదో దర్యాప్తు చేయాలని BCCI యోచిస్తున్నట్లు సమాచారం. కోల్‌కతాలో జనవరి 22న ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు శాంసన్ ఎంపికయ్యాడు.
Also Read: International Temple Conference : తిరుపతిలో తన రెండవ ఎడిషన్‌ను ప్రకటించిన ఎక్స్‌పో
BCCI మూలం టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. దేశీయ క్రికెట్ ప్రాముఖ్యత గురించి సెలెక్టర్లు, బోర్డు చాలా స్పష్టంగా ఉన్నాయి. గతేడాది అనుమతి లేకుండా దేశవాళీ మ్యాచ్‌లు ఆడనందుకు ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ కాంట్రాక్టులు కోల్పోయారు. శాంసన్ విషయంలో కూడా అతను టోర్నమెంట్ ఎందుకు ఆడలేదనే దానిపై బోర్డు, సెలెక్టర్లు కారణం తెలుసుకోని చర్యలు తీసుకోవచ్చని తెలుస్తోంది.
చివరి వన్డే మ్యాచ్ 2023లో ఆడాడు
భారత్ తరఫున తన చివరి ఐదు T20 మ్యాచ్‌లలో మూడు సెంచరీలు, రెండు డకౌట్‌లు అయిన శాంసన్.. చివరిసారిగా డిసెంబర్ 2023లో దక్షిణాఫ్రికాతో ODI ఆడాడు. ఆ మ్యాచ్‌లో అతను 3వ స్థానంలో బ్యాటింగ్ చేసి 114 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 108 పరుగులు చేశాడు. ఒకవేళ శాంసన్ భారత జట్టులో చోటు కోల్పోతే ఛాంపియన్స్ ట్రోఫీలో రెండో వికెట్ కీపర్‌గా ధృవ్ జురెల్ లేదా ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేయవచ్చని తెలుస్తోంది.