WTC Final: డ‌బ్ల్యూటీసీ 2025 ఫైన‌ల్ మ్యాచ్ వేదిక ఫిక్స్‌.. మ‌ళ్లీ అక్క‌డే..!

భారత్- ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ మధ్య డ‌బ్ల్యూటీసీ 2025కి (WTC Final) సంబంధించి పెద్ద అప్‌డేట్ వచ్చింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్ మ్యాచ్ ఇంగ్లండ్‌లో జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

  • Written By:
  • Updated On - January 27, 2024 / 11:29 AM IST

WTC Final: భారత్- ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ మధ్య డ‌బ్ల్యూటీసీ 2025కి (WTC Final) సంబంధించి పెద్ద అప్‌డేట్ వచ్చింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్ మ్యాచ్ ఇంగ్లండ్‌లో జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇది కాకుండా 2027 WTC ఫైనల్ కూడా ఇంగ్లండ్‌లోనే నిర్వ‌హించ‌నున్న‌ట్లు స‌మాచారం. 2021, 2023 సంవత్సరాల WTC ఫైనల్స్ కూడా ఇంగ్లండ్ మైదానంలోనే జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ మళ్లీ ఇంగ్లండ్‌లో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ను ఎందుకు నిర్వహిస్తున్నారనేది పెద్ద ప్రశ్న. దీని వెనుక కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

WTC ఫైనల్‌ను ఇంగ్లండ్‌లో మాత్రమే ఎందుకు నిర్వహిస్తున్నారు?

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఇంగ్లాండ్‌లో మాత్రమే జరగబోతోందని మ‌నం చెప్పుకున్నాం. 2025లో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్ లార్డ్స్ మైదానంలో జరగనుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చివరి మ్యాచ్ జూన్ నెలలో జరుగుతుంది. ఒక్కో దేశ పరిస్థితి, వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకుని జూన్‌లో వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆడాలని నిర్ణయించారు. సాధారణంగా జూన్‌లో ఏ దేశమూ అంతర్జాతీయ క్రికెట్ ఆడటంలో చాలా బిజీగా ఉండదు. అందుకే అన్నిటినీ పరిగణనలోకి తీసుకున్న త‌ర్వాత‌నే ఈ నెలలో WTC ఫైనల్ జరుగుతుంది. ఇందుకు ఇంగ్లండ్ ప‌రిస్థితులే కార‌ణ‌మ‌ని ఐసీసీ అధికారులు చెబుతున్నారు.

Also Read: India vs England: తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆలౌట్‌..!

అయితే, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ను భారతదేశంలో ఎందుకు నిర్వహించటం లేద‌నే సందేహం చాలామందిలో ఉంది. జూన్ నెలలో భారతదేశంలో చాలా వేడిగా ఉంటుంది. తరచుగా వర్షాలు కురుస్తాయి. అదే సమయంలో దక్షిణాఫ్రికాలో వర్షాకాలం క్రమంగా ఈ నెలలో ముగుస్తుంది. అదే సమయంలో ఈ నెలలో ఆస్ట్రేలియాలో చాలా చలి ఉంటుంది. శ్రీలంకలో కూడా ఈ కాలంలో వర్షం చాలా సార్లు కనిపిస్తుంది. ఈ కారణాల వల్ల అన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే అన్ని విధాలుగా మ్యాచ్‌లను నిర్వహించడానికి ఇంగ్లండ్ మాత్రమే సరిపోయే దేశం.

2021-2023 ఫైనల్ ఎక్కడ జరిగింది

దీనికి ముందు కూడా 2 WTC ఫైనల్స్ ఆడార‌ని మ‌న‌కు తెలిసిందే. ఈ రెండు ఫైనల్స్ కూడా ఇంగ్లండ్‌లోనే జరిగాయి. 2021 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌ను ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్ మైదానంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ భారత్- ఆస్ట్రేలియా మధ్య ఇంగ్లండ్‌లోని ఓవల్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 209 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఆ విధంగా ఇప్పటివరకు ఆడిన రెండు WTC ఫైనల్‌లు ఇంగ్లండ్‌లోనే జ‌రిగాయి. రాబోయే రెండు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ల ఫైనల్‌లు కూడా ఇంగ్లండ్‌లోనే నిర్వ‌హించ‌నున్నారు.

We’re now on WhatsApp : Click to Join