Site icon HashtagU Telugu

BCCI : కోహ్లీ ఎఫెక్ట్‌.. కీల‌క నిర్ణ‌యంపై బీసీసీఐ యూట‌ర్న్‌?

WTC Final Host

WTC Final Host

BCCI: ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడింది. తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో ఆ జట్టు 3 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూడగా, ఒక మ్యాచ్ డ్రా అయింది. భారత జట్టు పేలవ ప్రదర్శన తర్వాత బీసీసీఐ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే ఇప్పుడు ఇండియా టుడే ప్రకారం.. బీసీసీఐ (BCCI) తన నిర్ణయం నుండి వెనక్కి తగ్గవచ్చు.

బీసీసీఐ తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా?

బీసీసీఐ అధికారి ఒక‌రు ఇండియా టుడేతో మాట్లాడుతూ.. ఆటగాళ్లు తమ కుటుంబాలను, సన్నిహిత వ్యక్తులను ఎక్కువ కాలం పర్యటనలో ఉంచాలనుకుంటే, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తన నిబంధనలను మార్చడాన్ని పరిగణించవచ్చని ఆయ‌న తెలిపారు. అయితే అలా చేయడానికి ముందు ఆటగాళ్లకు బోర్డు అనుమతి అవసరం. ఆటగాళ్లు తమ కుటుంబాలు ఎక్కువ కాలం పర్యటనలో ఉండాలని కోరుకుంటే వారు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బీసీసీఐ తన సొంత నిర్ణయం ప్రకారం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.

ఆస్ట్రేలియా పర్యటన తర్వాత ఆటగాళ్లు వారి కుటుంబాలతో ప్రయాణించకుండా నిషేధిస్తూ బీసీసీఐ ఉత్తర్వులు జారీ చేసిన విష‌యం తెలిసిందే. ఆ తర్వాత బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంపై విరాట్ కోహ్లీ, కపిల్ దేవ్ అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

ఇటీవలే భారత జట్టు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకుంది. ఇప్పుడు భారత ఆటగాళ్ళు ఐపీఎల్‌లో బిజీగా ఉంటారు. మార్చి 22 నుంచి ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం కానుంది. దీని తర్వాత భారత జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటిస్తుంది. ఈ స‌మ‌యంలో రెండు జట్ల మధ్య 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడతారు. జూన్ 20 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుండగా, చివరి టెస్ట్ మ్యాచ్ జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకు జరుగుతుంది.

Also Read: DA Hike: కోటి మంది ఉద్యోగుల జీతం పెంచనున్న కేంద్ర ప్రభుత్వం!

టెస్ట్ సిరీస్ షెడ్యూల్

Exit mobile version