Site icon HashtagU Telugu

Kohli Daughter : కోహ్లీ గారాలపట్టిని చూశారా?

Kohli Daughter

Kohli Daughter

సౌతాఫ్రికాతో జరిగిన వన్డేలో ఓ స్పెషల్ గెస్ట్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఆ గెస్ట్ ఎవరో కాదు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్కశర్మ దంపతుల ముద్దుల తనయ వామిక. కేప్ టౌన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ కు అనుష్క , వామిక కూడా విచ్చేసారు. ఏడాది కాలంగా తమ కుమార్తె ఫోటోలను బయటకు విడుదల చేయకుండా విరుష్క జోడీ జాగ్రత్త పడింది. వామిక ఫోటోలు తీయొద్దంటూ పలు సందర్భాల్లో ఫోటోగ్రాఫర్లను కూడా ఈ జోడీ ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసింది. దీంతో ఇప్పటి వరకూ కోహ్లీ గారాల పట్టి ఫోటో ఒక్కటి కూడా బయటకు రాలేదు. అయితే కేప్ టౌన్ వన్డే వీవీఐపీ గ్యాలరీలో వామికను ఎత్తుకుని అనుష్క సందడి చేయడం, మ్యాచ్ ను టెలికాస్ట్ చేస్తున్న బ్రాడ్ కాస్టర్ ఆమెను చూపించడంతో ఎట్టకేలకు కోహ్లీ కుమార్తెను అందరూ చూడగలిగారు. అచ్చం కోహ్లీలానే ఉన్న వామిక చేసిన సందడి అంతా ఇంతా కాదు. డాడీ బ్యాటింగ్ చేస్తుంటే కేరింతలు కొడుతూ కనిపించింది. ముఖ్యంగా కోహ్లీ హాఫ్ సెంచరీ చేసిన తర్వాత వామిక చప్పట్ల కొడుతూ ఉండడం…దానికి మైదానంలో ఉన్న కోహ్లీ పాపాను లాలిస్తున్నట్టు ఇమిటేట్ చేయడం ఆకట్టుకుంది. ఇటీవలే ఫస్ట్ బర్త్‌డే చేసుకున్న వామిక సడన్‌గా టీవీలో కనిపించడంతో ఆ వీడియోలు, స్క్రీన్ షాట్స్ కొన్నినిమిషాలకే విపరీతంగా వైరల్ అయ్యాయి. అచ్చం చిన్నప్పటి కోహ్లీ లెక్కనే ఉన్న వామికను చూసి అభిమానులు ఖుషి అవుతున్నారు.

Exit mobile version