Site icon HashtagU Telugu

Ruturaj: మొన్న డబుల్ సెంచరీ.. ఇప్పుడు సెంచరీ

Ruturaj

Ruturaj

దేశవాళీ క్రికెట్ లో యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సూపర్ ఫామ్ కొనసాగుతోంది. విజయ హజారే ట్రోఫీలో రుతురాజ్ పరుగుల వరద పారిస్తున్నాడు. క్వార్టర్ ఫైన్లలో ఒకే ఓవర్లో ఏడు సిక్సర్లు బాదిన రుతురాజ్ తాజాగా సెమీస్ లో సెంచరీతో రెచ్చిపోయాడు తన ఫామ్ ను కొనసాగిస్తూ అసోం బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 126 బంతుల్లో 18 ఫోర్లు, 6 సిక్సర్లతో 168 పరుగులు చేశాడు. రుతురాజ్ బ్యాటింగ్ కు అసోం బౌలర్లు ప్రేక్షకుల్లా మిగిలారు. ఈ టోర్నీలో రుతురాజ్ సూపర్ ఫామ్ తో పరుగుల వరద పారిస్తున్నాడు. గత 9 ఇన్నింగ్స్ లలో ఏకంగా 7 సెంచరీలు చేయడం ద్వారా లిస్ట్ ఎ క్రికెట్ లో మరో రికార్డు నమోదు చేశాడు.
రుతురాజ్ విధ్వంసంతో మహరాష్ట్ర 350 పరుగుల భారీస్కోర్ చేసింది. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడుతున్న రుతురాజ్ గైక్వాడ్ ఈ ఏడాది సౌతాఫ్రికాపై వన్డే అరంగేట్రం చేశాడు. గత 9 ఇన్నింగ్స్ లలో ఒక డబుల్ సెంచరీ చేసిన రుతురాజ్ గైక్వాక్ నాలుగుసార్లు 150కి పైగా స్కోర్లు చేశాడు.

Exit mobile version