Site icon HashtagU Telugu

Retirement: టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌.. రిటైర్మెంట్‌కు సిద్ధ‌మైన మ‌రో ముగ్గురు ఆట‌గాళ్లు?!

Retirement

Retirement

Retirement: భారత క్రికెట్ జట్టుకు ‘ది వాల్’ (గోడ)గా పేరు పొందిన చతేశ్వర్ పుజారా ఆగస్టు 24న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు (Retirement) పలికి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇంగ్లాండ్ పర్యటనలో ఆయనకు చివరి అవకాశం లభిస్తుందని అందరూ భావించారు. కానీ జట్టులో స్థానం దక్కకపోవడంతో పుజారా రిటైర్మెంట్ ప్రకటించారు. పుజారా తర్వాత మరో ముగ్గురు భారత ఆటగాళ్లు కూడా అంతర్జాతీయ క్రికెట్ నుండి ఎప్పుడైనా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది.

అజింక్యా రహానే

చతేశ్వర్ పుజారా రిటైర్మెంట్ తర్వాత ఇప్పుడు అందరి దృష్టి అజింక్యా రహానేపై ఉంది. రహానే ఇటీవల రంజీ ట్రోఫీలో ముంబై జట్టు కెప్టెన్సీని వదులుకున్నారు. అంతేకాకుండా దేశవాళీ క్రికెట్‌లో కూడా అతనికి తగిన అవకాశాలు లభించడం లేదు. ముఖ్యంగా దులీప్ ట్రోఫీలో రహానేకు ఏ జట్టులోనూ చోటు దక్కలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో రహానే కూడా తన అంతర్జాతీయ కెరీర్‌కు ఎప్పుడైనా ముగింపు పలకొచ్చని అంచనా వేస్తున్నారు.

Also Read: 9 Carat Gold: శుభవార్త.. ఇక 9 క్యారెట్ల బంగారం కొనుగోలుకు అవకాశం!

ఉమేశ్ యాదవ్

భారత ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ కూడా చాలా కాలంగా భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. ఉమేశ్ చివరిసారిగా 2023లో టీమ్ ఇండియా జెర్సీలో కనిపించాడు. ఆ తర్వాత అతను జట్టుకు దూరమయ్యారు. ప్రస్తుతం ఉమేశ్ యాదవ్‌కు 37 సంవత్సరాలు. సెలెక్టర్లు కూడా అతని వైపు చూడటం లేదు. దీనితో అతను కూడా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇషాంత్ శర్మ

తన అద్భుతమైన బౌలింగ్‌తో భారత జట్టుకు అనేక మ్యాచుల్లో చిరస్మరణీయ విజయాలను అందించిన ఇషాంత్ శర్మ, చివరిసారిగా 2021లో మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ఇషాంత్‌కు భారత జట్టులో తిరిగి చోటు లభించలేదు. ఈ కారణం వల్ల ఇషాంత్ కూడా ఎప్పుడైనా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశం ఉంది.