Site icon HashtagU Telugu

AFC Asian Cup in 2023: ఆసియా కప్- 2023 అక్కడే.. ఎక్కడంటే..?

Imgonline Com Ua Resize Tjarqwcanzawwuab

Imgonline Com Ua Resize Tjarqwcanzawwuab

2023లో AFC ఆసియా ఛాంపియన్‌షిప్‌కు ఆతిథ్యం ఇచ్చే హక్కు ఖతార్‌కు లభించింది. 2022 FIFA ప్రపంచ కప్‌కి ఆతిథ్యం ఇచ్చిన వెంటనే ఈ టోర్నమెంట్‌ను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌‌కు వేదికగా నిలవనున్న ఖతార్ వచ్చే ఏడాది ఆసియా కప్‌ను కూడా నిర్వహించనుందని ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ (AFC) తెలిపింది. 2023 ఆసియా కప్ నిర్వహణ హక్కులను సొంతం చేసుకున్న చైనా ఈ ఏడాది ప్రారంభంలో కరోనా ఆ బాధ్యతల నుంచి తప్పుకుంది.

AFC ఆసియా ఛాంపియన్‌షిప్ 2023కు ఖతార్‌ సిద్ధంగా ఉంది. FIFA ప్రపంచ కప్ 2022 హోస్ట్ ఖతార్ 2023 AFC ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇచ్చే దేశంగా చైనాను భర్తీ చేస్తుంది. ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ సోమవారం ఈ విషయాన్ని ప్రకటించింది. ఆసియా ఫుట్‌బాల్ ద్వైవార్షిక ఛాంపియన్‌షిప్‌ను నిర్వహించే హక్కు కోసం ఖతార్‌ను మరో ఇద్దరు ఫైనలిస్టులైన ఇండోనేషియా, దక్షిణ కొరియాల కంటే ముందుగా ఎంపిక చేసినట్లు ఆసియా ఫుట్‌బాల్ కౌన్సిల్ ఒక ప్రకటనలో తెలిపింది. సోమవారం జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

వచ్చే నెలలో 2022 FIFA ప్రపంచ కప్‌కు ఖతార్ ఆతిథ్యం ఇవ్వబోతున్నందున.. AFC ప్రెసిడెంట్ షేక్ సల్మాన్ బిన్ ఇబ్రహీం అల్ ఖలీఫా మాట్లాడుతూ.. ప్రధాన అంతర్జాతీయ క్రీడా ఈవెంట్‌లను నిర్వహించడంలో ఖతార్ సామర్థ్యాలు, ట్రాక్ రికార్డ్ వివరాలు బాగున్నాయని అన్నారు. COVID-19 మహమ్మారి సమయంలో కఠినమైన నిబంధనల వలన చైనా హోస్ట్‌ నుండి వైదొలిగింది. AFC త్వరగా కొత్త హోస్ట్‌ను కనుగొనాల్సి వచ్చింది. AFC 2027 ఆసియా కప్ కోసం బిడ్డర్లుగా భారతదేశం, సౌదీ అరేబియాలను ప్రకటించింది. ఫిబ్రవరి 2023లో AFC సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోబడుతుంది.