Site icon HashtagU Telugu

Sunil Gavaskar: తనకు కేటాయించిన భూమిని ప్రభుత్వానికి ఇచ్చేసిన గవాస్కర్..!!

Gavaskar Imresizer

Gavaskar Imresizer

టీమిండియా మాజీ కెప్టెన్ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కు 1988లో మహారాష్ట్ర ప్రభుత్వం తనకు ఇచ్చిన భూమిని తిరిగిచ్చేశారు. ముంబైలోని అత్యంత ఖరీదైన బాంద్రా ప్రాంతంలో20వేల చదరపు అడుగుల్లో ఈ భూమి ఉంది. అయితే ఇందులో క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేయాలనుకున్న గవాస్కర్ ఆ పని చేయలేకపోయారు.

అకాడమీ విషయం పక్కన పెడితే…కనీస మౌలిక సదుపాయాలను కూడా అక్కడ ఏర్పాటు చేయలేదు. క్రికెట్ అకాడమీకి సంబంధించి సచిన్ టెండూల్కర్ తో కలిసి ఆ మధ్య ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను గవాస్కర్ కలిశారు. తనకున్న ఆలోచనను వివరించారు. చివరకు అది కూడా సక్సెస్ కాలేదు.

ఈనేపథ్యంలో గవాస్కర్ పై రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ…ఇన్నేళ్లు గడుస్తున్నా..అకాడమీని నిర్మించకుండా ఖరీదైన భూమిని ఖాళీగా ఉంచితే ఎలా అంటూ ప్రశ్నించారు. ఈనేపథ్యంలోనే తనకు కేటాయించిన భూమిని తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నట్లు ఉద్థవ్ థాకరేకి గవాస్కర్ లేఖ రాశారాని రాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ పేర్కొంది.