Good News For Sarfaraz Khan: ప్రస్తుతం టీమిండియా న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ బెంగళూరులో జరిగింది. ఇందులో భారత జట్టు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ప్రస్తుతం సిరీస్‌లో భారత జట్టు 1-0తో వెనుకబడి ఉంది. ఇప్పుడు రెండో టెస్టు పుణెలో జరగనుంది. ఈ టెస్ట్ మ్యాచ్‌కు ముందు టీమిండియా స్టార్ ప్లేయర్‌కు గొప్ప వార్త వచ్చింది.
సర్ఫరాజ్ ఖాన్ తండ్రి అయ్యాడు
న్యూజిలాండ్‌తో బెంగళూరు టెస్టులో తొలి అంతర్జాతీయ సెంచరీ సాధించిన బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్ (Good News For Sarfaraz Khan) ఇప్పుడు తండ్రి అయ్యాడు. సెంచరీ చేసిన రెండు రోజులకే సర్ఫరాజ్ ఖాన్‌కు ఈ శుభవార్త అందింది. అతని భార్య మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను సర్ఫరాజ్ తండ్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో పంచుకున్నారు. సర్పరాజ్ భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది.
Also Read: India-China : సరిహద్దు వివాదంలో భారత్, చైనా మధ్య కీలక ఒప్పందం
26 ఏళ్ల సర్ఫరాజ్ ఇటీవలే భారత్ vs న్యూజిలాండ్ 1వ టెస్టులో తన తొలి టెస్టు సెంచరీని నమోదు చేశాడు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ 195 బంతుల్లో 18 ఫోర్లు, మూడు సిక్సర్లతో 150 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. సర్ఫరాజ్ 2023 ఆగస్టు 6న కాశ్మీర్‌కు చెందిన రొమానా జహూర్‌ను వివాహం చేసుకున్నాడు. BSc విద్యార్థిని రొమానా జహూర్ కుటుంబ సంబంధం ద్వారా సర్ఫరాజ్ ఖాన్‌ను కలుసుకున్నారు. ఆ తర్వాత వీరి మధ్య స్నేహం ప్రేమగా మారి పెళ్లి దాకా వచ్చింది.
సర్ఫరాజ్ ఖాన్ ఇప్పటివరకు భారత్ తరఫున మొత్తం 4 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో అతను 50 కంటే ఎక్కువ సగటుతో 350 పరుగులు చేశాడు. బెంగళూరు టెస్ట్‌లో సెంచరీ చేయడం ద్వారా అతను టీమిండియాలో స్థానం సంపాదించడానికి ఎందుకు తహతహలాడుతున్నాడో చూపించాడు. సర్ఫరాజ్ ఇప్పుడు టెస్టు జట్టులో తన స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు.