ఆసియా కప్ 2025 (Asia Cup 2025)లో భారత్–పాకిస్తాన్ మ్యాచ్ అనంతరం చెలరేగిన వివాదం ఇంకా చల్లారడం లేదు. మ్యాచ్ సందర్భంగా భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్లతో షేక్ హ్యాండ్(Shake Hand) చేయకపోవడం రెండు దేశాల్లో పెద్ద చర్చకు దారితీసింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అసలు పాకిస్తాన్‌తో ఆడకూడదని డిమాండ్లు వచ్చినా, ఆటను కేవలం ఆటగానే చూడాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించింది. అయితే మ్యాచ్ అనంతరం జరిగిన ఈ పరిణామంపై మాజీ, ప్రస్తుత క్రికెటర్లతో పాటు రాజకీయ నాయకులు కూడా స్పందిస్తున్నారు.
Sam Konstas: టెస్ట్‌ను వన్డేగా మార్చిన ఆస్ట్రేలియా బ్యాటర్.. అద్భుత సెంచరీ!
ఈ క్రమంలో పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహీద్ అఫ్రిదీ(Shahid Afridi) చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదానికి దారి తీశాయి. దుబాయ్ వేదికగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో అఫ్రిదీ, భారత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసి, మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించాడు. అంతేకాకుండా కాంగ్రెస్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi )ని ప్రశంసిస్తూ ఆయనను పాజిటివ్ మైండ్‌సెట్ కలిగిన నాయకుడిగా పేర్కొన్నాడు. గాజాపై ఇజ్రాయెల్ దాడులను, పాకిస్తాన్‌పై భారత్ చేసిన ఆపరేషన్లను పోల్చుతూ చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేశాయి.
అఫ్రిదీ వ్యాఖ్యలపై భారత రాజకీయ వర్గాలు తీవ్రంగా స్పందించాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. అఫ్రిదీ లాంటి వ్యక్తి ప్రశంసించడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదని, భారత్‌ను ద్వేషించే ప్రతి ఒక్కరూ కాంగ్రెస్‌లోనే స్నేహితులను వెతుక్కుంటారని ఆరోపించారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా, ఐటీ సెల్ ఇంఛార్జ్ అమిత్ మాలవీయలు రాహుల్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ అఫ్రిదీ వీడియో క్లిప్‌లను పంచుకోవడంతో ఈ వ్యవహారం తీవ్ర రాజకీయ రగడకు దారి తీసింది.