Afghanistan vs Australia: పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో మరో మ్యాచ్‌ని జట్ల బ్యాట్స్‌మెన్, బౌలర్లు కాకుండా ‘థర్డ్ అంపైర్’ అంటే వర్షం నిర్ణయించింది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan vs Australia) మధ్య జరుగుతున్న గ్రూప్ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం లేదని అంపైర్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు 1-1 పాయింట్ దక్కింది. దీంతో టోర్నీలో ఆస్ట్రేలియా జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.
Also Read: CNG Leaders : మీరేమో చేపకూరలతో భోజనాలు.. విద్యార్థులేమో పస్తులుండాలా..? – కేటీఆర్
సెమీఫైనల్‌కు చేరిన మూడో జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. రెండో గ్రూప్ నుంచి భారత్, న్యూజిలాండ్ జట్లు ఇప్పటికే అర్హత సాధించాయి. అయితే గత మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆఫ్ఘనిస్థాన్ సెమీస్ ఆశలపై వర్షం నీళ్లు చల్లింది. అఫ్గాన్ జట్టు ఇప్పుడు సెమీఫైనల్‌లోకి ప్రవేశించడానికి శనివారం జరిగే ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా మ్యాచ్ కోసం వేచి ఉండాలి.
అఫ్గానిస్థాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ తరఫున సెడిఖుల్లా అటల్ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. 95 బంతుల్లో 85 పరుగులు చేశాడు. 6 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. అతనితో పాటు అజ్మతుల్లా ఉమర్జాయ్ కూడా 67 పరుగులు చేశాడు. 63 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సర్లు బాదాడు. ఆస్ట్రేలియా తరఫున బెన్ ద్వార్షుయిస్ అత్యధిక వికెట్లు పడగొట్టాడు. 9 ఓవర్లలో 47 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. అతడితో పాటు జాన్సన్, జంపా చెరో 2 వికెట్లు తీశారు. వీరితో పాటు ఎల్లిస్, మ్యాక్స్‌వెల్ తలో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.
అంతకుముందు 274 పరుగుల స్కోరును ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. మాథ్యూ షార్ట్, హెడ్ కేవలం 4.3 ఓవర్లలో 44 పరుగులు జోడించారు. 20 పరుగుల వద్ద మాథ్యూ షార్ట్ ఔటయ్యాడు. ఔటైన తర్వాత హెడ్, స్మిత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఆ తర్వాత వర్షం కురవడంతో మ్యాచ్‌ని తిరిగి ప్రారంభించలేకపోయారు. మ్యాచ్ ఆగే సమయానికి హెడ్ 59 పరుగులతో, స్మిత్ 19 పరుగులతో ఆడుతున్నారు.