వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ దుమ్మురేపుతోంది. వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కు చేరుకుంది. ఆప్ఘనిస్థాన్‌తో చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో కివీస్ 149 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఇన్నింగ్స్ ఆరంభంలో తడబడింది. ఓపెనర్లు కాన్వే 20 రన్స్‌కే ఔటవగా… మరో ఓపెనర్ విల్ యంగ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. రచిన్ రవీంద్ర కూడా 32 పరుగులతో నిలకడగా ఆడి రెండో వికెట్‌కు 79 పరుగులు జోడించారు. వీరిద్దరూ ఔటైన కాసేపటికే డారిల్ మిఛెల్ కూడా వెనుదిరగడంతో కివీస్ కష్టాల్లో పడింది. ఈ దశలో వికెట్ కీపర్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్ న్యూజిలాండ్‌ను ఆదుకున్నారు. హాఫ్ సెంచరీలతో జట్టుకు మంచి స్కోర్ అందించారు. ఐదో వికెట్‌కు 144 పరుగులు జోడించారు. లాథమ్ 74 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 , ఫిలిప్స్ 80 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 71 రన్స్ చేశారు. చివర్లో చాప్‌మన్ ధాటిగా ఆడాడు. కేవలం 12 బంతుల్లోనే 25 పరుగులు చేశాడు. ఫలితంగా న్యూజిలాండ్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 288 పరుగులు చేసింది. ఆరంభంలో వికెట్లు తీసి జోరు మీద కనిపించిన ఆప్ఘనిస్తాన్ తర్వాత గాడి తప్పింది. ఫీల్డింగ్‌లో పలు తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఛేజింగ్‌లోనూ ఆప్ఘనిస్తాన్ పెద్దగా పోటీనివ్వలేకపోయింది. ఆరంభం నుంచే తడబడిది. ఓపెనర్లు సరైన ఆరంభాన్ని ఇవ్వలేకపోవడం, కీలక బ్యాటర్లు విఫలమవడంతో ఓటమి ఖాయమైపోయింది. రహమత్ షా 36 , అజ్మతుల్లా 27 తప్పిస్తే మిగిలిన వారంతా విఫలమయ్యారు. ఇంగ్లాండ్‌పై ధాటిగా ఆడి మంచి స్కోర్ చేసిన ఆప్ఘన్ బ్యాటర్లు కివీస్‌పై మాత్రం చేతులెత్తేశారు. దీంతో ఆప్ఘనిస్తాన్ 34.4 ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలింది. కివీస్ బౌలర్లలో శాంట్నర్ 3, ఫెర్గ్యుసన్ 3 , బౌల్ట్ 2 , హెన్రీ, రచిన్ రవీంద్ర ఒక్కో వికెట్ పడగొట్టారు. తాజాగా గెలుపుతో ఈ వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్ నాలుగో విజయాన్ని అందుకుంది. 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో నిలిచింది. భారత్ మూడు విజయాలతో 6 పాయింట్లు సాధించి రెండో స్థానంలో ఉంది.
Also Read: World Cup 2023: ప్రపంచ కప్ లో ఇప్పటికివరకు టాప్ లో ఉన్నది ఎవరు?