world cup 2023: ప్రపంచ కప్ లో కీలక మ్యాచ్ లో పాకిస్థాన్ పరాజయం పాలైంది. చెన్నై వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాకిస్థాన్ నిర్దేశించిన 282 పరుగుల లక్ష్యాన్ని ఆఫ్ఘనిస్థాన్ కేవలం 2 వికెట్లు కోల్పోయి సాధించింది. జట్టు తరఫున గుర్బాజ్ 65 పరుగులతోనూ, ఇబ్రహీం జద్రాన్ 87 పరుగులతోనూ బలమైన ఇన్నింగ్స్ ఆడారు. రహమత్ షా 77 పరుగులు చేసి నాటౌట్‌గా వెనుదిరగగా, కెప్టెన్ షాహిదీ 48 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. జట్టు తరపున కెప్టెన్ బాబర్ ఆజం 74 పరుగులతో పటిష్ట ఇన్నింగ్స్ ఆడాడు. అబ్దుల్ షఫీక్ 58 పరుగులు చేశాడు.
ఆఫ్ఘానిస్థాన్ బౌలింగ్ : నూర్ 3, హక్ 2, నబీ, అజ్మతుల్లాకు ఒక్కో వికెట్ దక్కాయి.
పాకిస్థాన్ బౌలింగ్ : ఆఫ్రిది, హసన్ కు ఒక్కో వికెట్ లభించాయి.
Also Read: Ram Charan : వాళ్లకు సారీ చెప్పిన రాం చరణ్.. ఎందుకంటే..?