AFG vs NZ Test: న్యూజిలాండ్‌తో జరిగే ఏకైక టెస్టుకు ముందు ఆఫ్ఘనిస్తాన్(Afghanistan) కు బిగ్ షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ జట్టుకు దూరమయ్యాడు. సెప్టెంబర్ 9 నుంచి గ్రేటర్ నోయిడాలో ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఏకైక టెస్టు మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే దీనికి ముందు ఇబ్రహీం జద్రాన్ గాయ పడ్డాడు. ఈ టెస్టు మ్యాచ్‌తో పాటు దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌కి కూడా ఇబ్రహీం జద్రాన్ దూరమయ్యాడు.
న్యూజిలాండ్‌తో జరిగే ఏకైక టెస్టు మ్యాచ్‌కు ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్(Ibrahim Zadran) దూరమయ్యాడు. ఆదివారం గ్రేటర్ నోయిడాలో గాయం కారణంగా ఇబ్రహీం టెస్టు మ్యాచ్‌కు దూరమయ్యాడు. 22 ఏళ్ల ఇబ్రహీం తన జట్టు చివరి ప్రాక్టీస్ సెషన్‌లో చీలమండకు గాయమైంది. ప్రాక్టీస్ సెషన్‌లో ఇబ్రహీం జద్రాన్ చీలమండకు గాయమైనట్లు మ్యాచ్‌కు ముందు రోజు ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ విలేకరుల సమావేశంలో చెప్పాడు. రేపటి మ్యాచ్‌కి ముందు అతని పరిస్థితి ఎలా ఉంటుందో పూర్తిగా అంచనా వేయలేను. ఈ విషయంలో వేచి చూడాల్సిందేనని చెప్పాడు.
న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు మ్యాచ్‌లో జద్రాన్ ఆడకపోతే ఆది జట్టుపై తీవ్ర ప్రభావం పడనుంది. గత కొంత కాలంగా అఫ్ఘాన్ జట్టుకు ఈ స్టార్ ఓపెనర్ మంచి ప్రదర్శన చేస్తున్నాడు. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఇబ్రహీం జద్రాన్ ఎడమ కాలు బెణుకు కారణంగా న్యూజిలాండ్‌తో జరిగే ఏకైక టెస్టు మరియు దక్షిణాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్నట్లు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఆయన త్వరగా కోలుకోవాలని ఏసీబీ ఆకాంక్షిస్తోంది.
22 ఏళ్ల ఇబ్రహీం జద్రాన్ ఆఫ్ఘనిస్తాన్ తరపున 7 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 4 హాఫ్ సెంచరీలు నందు ఉచేశాడు.
Also Read: Hero Splendor Plus: కొత్త ఫీచర్స్ విడుదలైన హీరో స్ప్లెండర్ బైక్.. ప్రత్యేకతలు ఇవే!