Australia Squad India Tour: భారత్‌ టూర్‌కు ఆసీస్ జట్టు ఇదే

భారత్‌ పర్యటన కోసం ఆస్ట్రేలియా జట్టును (Australia Squad India Tour) ప్రకటించారు. పాట్ కమ్మిన్స్ సారథ్యంలోని 18 మందితో కూడిన ఆసీస్ జట్టులో పలువురు యువక్రికెటర్లకు చోటు దక్కింది. అనూహ్యంగా ఫామ్‌లో ఉన్న స్పిన్నర్ ఆడమ్ జంపాను ఆసీస్ సెలక్టర్లు పక్కన పెట్టారు. చాలా రోజుల తర్వాత పీటర్ హ్యాండ్స్ కాంబ్‌కు పిలుపునిచ్చారు.

  • Written By:
  • Publish Date - January 11, 2023 / 02:55 PM IST

భారత్‌ పర్యటన కోసం ఆస్ట్రేలియా జట్టును (Australia Squad India Tour) ప్రకటించారు. పాట్ కమ్మిన్స్ సారథ్యంలోని 18 మందితో కూడిన ఆసీస్ జట్టులో పలువురు యువక్రికెటర్లకు చోటు దక్కింది. అనూహ్యంగా ఫామ్‌లో ఉన్న స్పిన్నర్ ఆడమ్ జంపాను ఆసీస్ సెలక్టర్లు పక్కన పెట్టారు. చాలా రోజుల తర్వాత పీటర్ హ్యాండ్స్ కాంబ్‌కు పిలుపునిచ్చారు. హ్యాండ్స్ కాంబ్ దాదాపు మూడేళ్ళ తర్వాత ఆసీస్ జట్టులోకి తిరిగి వచ్చాడు. షెఫీల్డ్ సీజన్‌లో అద్భుతంగా రాణించడంతో అతన్ని ఎంపిక చేశారు. గత సీజన్‌లో హ్యాండ్స్‌కాంబ్ 697 పరుగులు చేశాడు. హ్యండ్స్‌కాంబ్ స్పిన్నర్ కూడా కావడంతో భారత్‌పై పిచ్‌లకు సరిపోతాడని అంచనా వేసింది.

ఇదిలా ఉంటే స్టార్ పేసర్ మిఛెల్ స్టార్క్ తొలి టెస్టుకు అందుబాటులో ఉండడని తెలుస్తోంది. అటు సౌతాఫ్రికాతో టెస్టులో గాయపడిన కామెరూన్ గ్రీన్ ఎంపికైనప్పటకీ ఏ మ్యాచ్‌ నుంచి అందుబాటులో ఉంటాడనేది తెలియాల్సి ఉంది. కాగా కొందరు కొత్త ప్లేయర్లకు కూడా చోటు దక్కింది. విక్టోరియా స్పిన్నర్ టాడ్ మర్ఫీ, లాన్స్ మోరిస్ ఎంపికయ్యారు.ఈ టూర్ కోసం ఆసీస్ సెలక్టర్లు నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేశారు. నాథన్ లయోన్ , ఆస్టన్ అగర్‌తో పాటు మర్ఫీ, మిఛెల్ స్విప్సెన్‌లను ఎంపిక చేశారు. కాగా లాన్స్ మోరిస్ భారత్ టూర్‌లో అరంగేట్రం చేసే అవకాశముంది. అటు హ్యాజిల్‌వుడ్ కూడా ఆసీస్ పేస్ విభాగంలో కీలకం కానున్నాడు. తొలి టెస్టుకు స్టార్క్ లేకున్నా హ్యాజిల్‌వుడ్‌ ఫామ్‌లో ఉండడంతో ఆసీస్‌కు పెద్ద ఇబ్బంది లేదు.

Also Read: UP Men’s Bike Viral Video: ఇదేందయ్యా ఇది.. మూడు బైకులపై 14 మంది ప్రయాణం.. వీడియో వైరల్

ఈ టూర్‌లో ఆస్ట్రేలియా నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. ఫిబ్రవరి 9 నుంచి టెస్ట్ సిరీస్ ఆరంభం కానుండగా.. వన్డే సిరీస్ మార్చి 17 నుంచి మొదలవుతుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. సౌతాఫ్రికాపై టెస్ట్ సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న ఆ జట్టు వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. అయితే ఆసీస్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌లో టీమిండియా గెలిస్తే రోహిత్‌సేన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుతుంది.

భారత్‌ టూర్‌కు ఆసీస్ జట్టు: పాట్ కమిన్స్(కెప్టన్‌), ఆష్టన్ అగర్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, పీటర్ హ్యాండ్స్‌కాంబ్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లయన్, లాన్స్ మోరిస్, టాడ్ మర్ఫీ, మాథ్యూ రెన్‌షా, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మిచెల్ స్వెప్సన్, డేవిడ్ వార్నర్.