Site icon HashtagU Telugu

Hardik Pandya: హార్దిక్ ఫిట్నెస్ పై సీనియర్ల అనుమానాలు

Hardik Pandya

Hardik Pandya

Hardik Pandya: హార్దిక్ ఫిట్నెస్ పై సీనియర్లు అనుమానాలు లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా గత మ్యాచ్ లో హార్దిక్ బౌలింగ్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిన్న ఆదివారామ్ వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ కీలక మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ముంబై ఇండియన్స్ 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. అనంతరం ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేయగలిగింది. ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా 4 ఓవర్లలో 43 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ లోనూ విఫలమయ్యాడు. ఇన్నింగ్స్ లో కేవలం 2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.

చెన్నై తో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ ఫిట్నెస్ పై ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ప్రశ్నలు సంధించాడు. సీఎస్‌కే ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో హార్దిక్ పాండ్యా 26 పరుగులు ఇచ్చాడని గుర్తు చేశాడు. ఎంఎస్ ధోని వరుస మూడు బంతుల్లో మూడు సిక్సర్లు బాదాడు.మరో బంతికి 2 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ధోనీ 500 స్ట్రైక్ రేట్ మైంటైన్ చేశాడు. ఇక హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ మరియు బౌలింగ్ చాలా సాధారణంగా కనిపించిందని భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ అభివర్ణించాడు. గిల్‌క్రిస్ట్ ఆస్ట్రేలియన్ క్రీడా పదజాలాన్ని ఉపయోగించి పాండ్యాను “ప్రొపీ” అని పిలిచాడు, అంటే హార్దిక్ పాండ్యా పూర్తిగా ఫిట్‌గా లేడని అర్థం.

We’re now on WhatsAppClick to Join

ఆస్ట్రేలియన్ మాజీ వికెట్ కీపర్ గిల్‌క్రిస్ట్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ హార్దిక్ పాండ్యా బౌలింగ్ చెల్లాచెదురుగా కనిపించిందని, ఎడ్జ్ లోపించిందని చెప్పారు. కాగా పాండ్యలో అంకితభావం ఉన్నప్పటికీ, అతను శారీరకంగా 100 శాతం ఫిట్‌గా లేడని స్పష్టం అవుతుందని గిల్‌క్రిస్ట్ అన్నాడు. ఇక హార్దిక్ బౌలింగ్ చేసిన విధానంపై టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడాడు.డెత్ ఓవర్లలో హార్దిక్ నైపుణ్యం సరిగా లేదని అభిప్రాయపడ్డాడు. ఈ విధంగా హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్‌పై సీనియర్లు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు.

Also Read: KTR: పెద్దపల్లిలో పెద్ద మెజారిటీతో గెలుస్తున్నం, వరంగల్ లో విజయం మనదే!