Greater Noida Stadium Facilities: న్యూజిలాండ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య టెస్ట్ మ్యాచ్ గ్రేటర్ నోయిడా స్టేడియంలో జరగాల్సి ఉంది, అయితే గ్రేటర్ నోయిడా స్టేడియం పరిస్థితి అధ్వాన్నంగా ఉండటంతో మొదటి రోజు ఆట ఆగిపోయింది. ఔట్ ఫీల్డ్ పేలవంగా ఉండడంతో రెండో రోజు ఆటను కూడా రద్దు చేయాల్సి వచ్చింది . ఇదిలా ఉండగా క్రీడాకారులకు భోజన సదుపాయాలు కూడా ప్రశ్నార్థకంగా మారాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూసి ప్రతిఒక్కరు షాక్ కు గురవుతున్నారు.
గ్రేటర్ నోయిడా స్టేడియం( Greater Noida Stadium)యాజమాన్యం తీరుపై సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆటగాళ్లు. ఒకవైపు స్టేడియంలో ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో మైదానాన్ని ఎండబెట్టడం గ్రౌండ్ స్టాఫ్ కు సమస్యగా మారింది. తడిగా ఉన్న అవుట్‌ఫీల్డ్‌ను ఆరబెట్టడానికి విద్యుత్ ఫ్యాన్‌లను ఉపయోగించారు. అయినప్పటికీ రెండో రోజు ఆట ప్రారంభం కాలేదు. మళ్లీ ఆడేందుకు ఇక్కడికి రాబోమని ఆఫ్ఘనిస్తాన్ కూడా చెప్పింది. మరోవైపు వాష్‌రూమ్‌లోని వాష్ బేసిన్‌లో పాత్రలు కడుక్కోవడమే కాకుండా వంట చేయడానికి బాత్రూం వాటర్ణే వాడుతున్నారు. అంతేకాదు మహిళల వాష్ రూమ్స్‌ను కూడా పురుషులు వాడుకోవాల్సిన పరిస్థితి. అఫ్గానిస్థాన్ స్వదేశంలో జరిగే మ్యాచ్‌లకు భారత్ ఆతిథ్యం ఇస్తుండగా, న్యూజిలాండ్‌తో జరిగే ఏకైక టెస్టు కోసం బీసీసీఐ గ్రేటర్ నోయిడా క్రికెట్ గ్రౌండ్‌ను ఆఫ్ఘనిస్థాన్‌కు వేదికగా నిర్ణయించింది.
నిజానికి లక్నోలోని ఎకానా స్టేడియం అనుకున్నప్పటికీ ఆ స్టేడియం అప్పటికే బుక్ అయిపోయింది. అందువల్ల గ్రేటర్ నోయిడాను ఎంచుకోవలసి వచ్చింది. గ్రేటర్ నోయిడాలో గత 10 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సెప్టెంబర్ 9 నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టాయి. మ్యాచ్ ప్రారంభానికి ఒకరోజు ముందు వర్షం కురిసింది. దీంతో మైదానం అవుట్‌ఫీల్డ్ తడిగా మారింది. దీంతో మ్యాచ్ ప్రారంభం కాలేదు. ఈ కారణంగా రెండో రోజు కూడా రద్దు అయినట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు మ్యాచ్‌లో టాస్ పడలేదంటే అర్ధం చేసుకోవచ్చు మైదానం మెంటైనెన్స్ ఎలా ఉందొ. 2017 నుంచి ఈ మైదానంలో బీసీసీఐ ఎలాంటి మ్యాచ్‌లు నిర్వహించలేదు. తాజాగా ఈ మైదానాన్ని అఫ్గానిస్థాన్‌కు ఇచ్చారని బిసిసి(BCCI)పై క్రికెట్ ప్రపంచంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.స్టేడియం తీరుపై ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు(ACB) అసంతృప్తి వ్యక్తం చేసింది. మైదానంలో పూర్తి నిర్వహణ లోపం ఉందని, ఈ మైదానానికి ఆఫ్ఘన్ మళ్లీ రాదని స్పష్టం చేశారు. ఇక్కడ సౌకర్యాలపై ఆటగాళ్లు కూడా అసంతృప్తిగా ఉన్నారు అని ఎసిబి అధికారి తెలిపారు.
Also Read: India vs Bangladesh: టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్.. ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!