Site icon HashtagU Telugu

Abu Dhabi T10 League: అబుదాబి టీ 10 లీగ్ లో రైనా , భజ్జీ

Raina Bhajji Imresizer

Raina Bhajji Imresizer

క్రికెట్ నయా ఫార్మాట్ అబుదాబి టీ10 లీగ్ ఆరో సీజన్ కు కౌంట్ డౌన్ మొదలయింది. ప్రపంచ వ్యాప్తంగా పలువురు స్టార్ ప్లేయర్స్ ఈ సారి లీగ్ లో ఆడనున్నారు. ఈ సీజన్ లో ఇప్పుడు భారత మాజీ క్రికెటర్లు కూడా అభిమానులను అలరించనున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, సురేష్‌ రైనా అబుదాబి టీ10 లీగ్ లో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఈ లీగ్‌లో ఢిల్లీ బుల్స్‌ తరపున హర్భజన్ సింగ్, డిఫెండింగ్ ఛాంపియన్ డెక్కన్ గ్లాడియేటర్స్‌కు రైనా ప్రాతినిధ్యం వహించనున్నారు. డక్కన్‌ గ్లాడియేటర్స్‌ జట్టుకు వెస్టిండీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ డ్వేన్ బ్రావో కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. నిజానికి టీ 10 లీగ్ ఆరంభమై అయిదు సీజన్లు జరిగినా భారత ఆటగాళ్ళ ప్రాతినిథ్యం పెద్దగా లేదు. విదేశీ లీగ్స్ లో ఆడేందుకు బీసీసీఐ అనుమతి ఇవ్వకపోవడమే దీనికి కారణం. అయితే రిటైర్ మెంట్ ప్రకటించిన ప్లేయర్స్ మాత్రం ఆడేందుకు బీసీసీఐ ఓకే చెప్పింది. దీంతో పలువురు మాజీ ప్లేయర్స్ మాత్రం అబుదాబి టీ10 లీగ్ లో ఆడుతున్నారు.

టీమిండియా స్టార్ ప్లేయర్స్ ఆడితే టీ 10 లీగ్ మరింత ఆదరణ పొందడం ఖాయమని నిర్వాహకులు చెబుతున్నారు. దీనిలో భాగంగానే మాజీ ప్లేయర్స్ తో ఒప్పందం చేసుకుంటున్నారు. గతంలో సెహ్వాగ్ , జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్ , బద్రీ నాథ్ , యూసుఫ్ పఠాన్, మునాఫ్ పటేల్ వంటి ఆటగాళ్ళు టీ 10 లీగ్ లో ఆడారు. ఇదిలా ఉంటే
సురేష్‌ రైనా ప్రస్తుతం రోడ్‌ సెప్టీ లీగ్‌లో ఇండియా లెజెండ్స్‌ జట్టుకు ఆడుతున్నాడు. అదే విధంగా హర్భజన్‌ సింగ్‌ లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌లో మణిపాల్‌ టైగర్స్‌ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. హార్భజన్‌ సింగ్‌ 2021లో అన్ని ఫార్మాట్‌ల క్రికెట్‌ నుంచి తప్పుకోగా.. రైనా ఇటీవలే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. కాగా రైనా ఆడనున్న గ్లాడియేటర్స్‌ జట్టులో టిమ్‌ డేవిడ్‌, రహ్మానుల్లా గుర్బాజ్, విల్ జాక్స్, డొమినిక్ డ్రేక్స్, ఫజల్‌హాక్ ఫరూకీ వంటి యువ ఆటగాళ్లు ఉన్నారు. ఈ జట్టుకు జింబాబ్వే మాజీ ఆటగాడు అండీ ఫ్లవర్‌ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. అబుదాబి టీ10 లీగ్‌ ఆరో సీజన్ నవంబర్‌ 23 నుంచి ప్రారంభం కానుంది.