Abhishek Sharma: అభిషేక్ శర్మ ప్రస్తుతం T20 క్రికెట్‌లో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఆయన ఆసియా కప్ 2025లో అద్భుతమైన బ్యాటింగ్‌ను ప్రదర్శించారు. ఇప్పుడు ICC కొత్త T20 అంతర్జాతీయ రేటింగ్‌లు విడుదలయ్యాయి. అభిషేక్ శర్మ (Abhishek Sharma) ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఆయన ఇంగ్లాండ్‌కు చెందిన డేవిడ్ మలాన్‌ను వెనక్కి నెట్టి T20 క్రికెట్‌లో ఇప్పటివరకు అత్యధిక రేటింగ్ సాధించిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచారు.
Also Read: YS Sharmila: కూటమి ప్రభుత్వంపై షర్మిల విమర్శనాస్త్రాలు!
అభిషేక్ 931 పాయింట్లను నమోదు చేశారు. ఇది ఇప్పటివరకు అత్యధికం. భారతదేశం తరపున అత్యధిక ICC T20 ర్యాంకింగ్ సాధించిన బ్యాట్స్‌మెన్ల జాబితాలో ఆయన విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్‌లను కూడా అధిగమించారు.
అభిషేక్ శర్మ ప్రపంచ రికార్డు
టీమ్ ఇండియా తరఫున అరంగేట్రం చేసినప్పటి నుండి అభిషేక్ శర్మ నిలకడగా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఆయన ఇప్పటికే T20 అంతర్జాతీయ ర్యాంకింగ్‌లో నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ఉన్నారు. ఇప్పుడు ఆయన తన కెరీర్‌లో అత్యధిక రేటింగ్‌ను సాధించారు. ఆయన ఆసియా కప్ మధ్యలో 931 పాయింట్లను సాధించి, డేవిడ్ మలాన్ 919 రేటింగ్ రికార్డును బద్దలు కొట్టారు. శ్రీలంకపై సూపర్ 4లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన తర్వాత ఆయన 931 పాయింట్లకు చేరుకోగలిగారు. ఆసియా కప్ ఫైనల్ తర్వాత ఆయన రేటింగ్ 926కి తగ్గినా, ఇప్పటికీ మలాన్ కంటే చాలా ముందున్నారు.
ఆసియా కప్ 2025లో అభిషేక్ శర్మ విధ్వంసం
అభిషేక్ శర్మకు ఆసియా కప్ 2025 చాలా అద్భుతంగా సాగింది. ఆయన టోర్నమెంట్‌లో మొత్తం 7 మ్యాచ్‌లు ఆడి, 314 పరుగులు సాధించారు. 44.86 సగటుతో బ్యాటింగ్ చేయగా.. ఈ క్రమంలో ఆయన స్ట్రైక్ రేట్ 200గా ఉంది. ఆయన టోర్నమెంట్‌లో మొత్తం 32 ఫోర్లు, 19 సిక్సులు బాదారు. టోర్నమెంట్‌లో శర్మ నిలకడగా టీమ్ ఇండియాకు మంచి ఆరంభాన్ని అందించారు. ఫైనల్లో అభిషేక్ బ్యాట్ పెద్దగా ఆడకపోయినా.. టీమ్ ఇండియా పాకిస్థాన్‌ను ఓడించి ఆసియా కప్ 2025 టైటిల్‌ను కైవసం చేసుకుంది.