Abhishek Sharma: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ-20 అంతర్జాతీయ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ తన బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. నాగ్‌పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడుతూ కేవలం 22 బంతుల్లోనే అర్ధ సెంచరీ బాదాడు.
అభిషేక్ సిక్సర్‌తో తన ఖాతాను ప్రారంభించి న్యూజిలాండ్ బౌలింగ్ ఎటాక్‌తో ఓ ఆటాడుకున్నాడు. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరినప్పటికీ అభిషేక్ తన మెరుపు బ్యాటింగ్‌ను కొనసాగించాడు. న్యూజిలాండ్‌పై భారత్ తరఫున నమోదైన అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ ఇదే కావడం విశేషం.
అభిషేక్ సృష్టించిన విధ్వంసం
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. సంజూ శాంసన్ 2 ఫోర్లు కొట్టి 10 పరుగులకే నిష్క్రమించాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ కూడా 8 పరుగులకే అవుటయ్యాడు. అయితే దీని ప్రభావం అభిషేక్ మీద ఏమాత్రం పడలేదు. అతను ఒక వైపు నుండి తన ధాటిని కొనసాగించాడు. ఫోర్ల కంటే ఎక్కువగా సిక్సర్లతోనే డీల్ చేశాడు.
Also Read: విరాట్ కోహ్లీకి బిగ్ షాక్.. నెంబర్ వన్ స్థానం కోల్పోయిన కింగ్!
అభిషేక్ కేవలం 22 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ముందు న్యూజిలాండ్ పటిష్ట బౌలింగ్ లైనప్ పూర్తిగా నిస్సహాయంగా కనిపించింది. అభిషేక్ మొత్తం 35 బంతుల్లో 84 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తన ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు.
న్యూజిలాండ్‌పై అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ
టీ-20 అంతర్జాతీయ క్రికెట్‌లో న్యూజిలాండ్‌పై భారత్ తరఫున అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన రికార్డును అభిషేక్ శర్మ తన పేరిట లిఖించుకున్నాడు. ఈ క్రమంలో అతను కె.ఎల్. రాహుల్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. రాహుల్ 2020లో న్యూజిలాండ్‌పై 23 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. దీనితో పాటు టీ-20 ఇంటర్నేషనల్స్‌లో 25 కంటే తక్కువ బంతుల్లో అత్యధిక సార్లు హాఫ్ సెంచరీలు బాదిన బ్యాటర్ల జాబితాలో అభిషేక్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. అతను ఈ ఘనత సాధించడం ఇది 8వ సారి.
