BCCI Central Contract: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI Central Contract) త్వరలో తన కొత్త సెంట్రల్ ఒప్పందాన్ని ప్రకటించనుంది. రిపోర్టుల ప్రకారం.. ఐపీఎల్ 2025 సమయంలోనే బోర్డు తన కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్‌ను ప్రకటించనుంది. సాధారణంగా బోర్డు ప్రతి సంవత్సరం జనవరి-ఫిబ్రవరిలో ఈ ప్రకటన చేస్తుంది. కానీ ఇప్పటివరకు సెంట్రల్ కాంట్రాక్ట్ ప్రకటన జరగలేదు. కొత్త కాంట్రాక్ట్‌లో ముగ్గురు యువ ఆటగాళ్లకు స్థానం లభించే అవకాశం ఉంద. వారు తమ ఆటతో అద్భుతంగా ఆకట్టుకున్నారు.
ఈ ముగ్గురు ఆటగాళ్లకు స్థానం లభించే అవకాశం
కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్‌లో పలువురు ఆటగాళ్లు బయటకు వెళ్లే అవకాశం ఉండగా, కొత్త ముఖాలను ఒప్పందంలో చేర్చే అవకాశం ఉంది. అభిషేక్ శర్మ, నీతీష్ రెడ్డి, హర్షిత్ రాణాలకు కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్‌లో స్థానం లభించే అవకాశం ఉంది. ఈ ఆటగాళ్లు భారత్ తరఫున అద్భుతమైన ప్రదర్శన చేశారు. అభిషేక్ శర్మ బంగ్లాదేశ్‌తో జరిగిన టీ-20 సిరీస్, ఇంగ్లండ్‌తో జరిగిన టీ-20 సిరీస్‌లో తన బ్యాట్‌తో అదరగొట్టాడు. నీతీష్ రెడ్డి కూడా భారత్ తరఫున అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అతను బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సమయంలో భారత్ తరఫున సెంచరీ సాధించి తన ప్రతిభను ప్రపంచానికి చాటాడు. అలాగే, హర్షిత్ రాణా కూడా భారత్ తరఫున నిలకడగా మంచి ప్రదర్శన చేస్తున్నాడు. ఈ కారణంగా, ఈ ముగ్గురు ఆటగాళ్లు సెంట్రల్ కాంట్రాక్ట్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు.
శ్రేయస్ అయ్యర్ తిరిగి కాంట్రాక్ట్‌లోకి?
2024లో శ్రేయస్ అయ్యర్‌ను BCCI తన సెంట్రల్ కాంట్రాక్ట్ నుండి తొలగించింది. కానీ, ఈ ఆటగాడు తన అద్భుతమైన బ్యాటింగ్‌తో మళ్లీ గుర్తింపు పొందాడు. అతను 2025 చాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరఫున అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. అంతేకాకుండా ఈ కుడి చేతి బ్యాట్స్‌మన్ ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో కూడా అద్భుతమైన ప్రదర్శనతో టీమ్ ఇండియాలో తన స్థానం కోసం బలమైన పోటీ ఇచ్చాడు. శ్రేయస్ అయ్యర్ కూడా బీసీసీఐ ప్రకటించనున్న సెంట్రల్ కాంట్రాక్ట్‌లో తిరిగి చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు.