Abhishek Sharma: జనవరి 22 నుండి భారత్ ఇంగ్లండ్ మధ్య 5 టి20 మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు భారత జట్టును త్వరలో ప్రకటించనున్నారు. అయితే ఈ సిరీస్ పై ఆశలు పెట్టుకున్న ఓ స్టార్ యువ బ్యాటర్ కి నిరాశ తప్పదంటున్నారు మేనేజ్మెంట్ ప్రతినిధులు. ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు నుంచి యువ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మను (Abhishek Sharma) తప్పించే అవకాశం ఉంది. దీనికి రెండు కారణాలున్నాయి.
జింబాబ్వేతో అరంగేట్రం చేసిన టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. కానీ ఆ ఫామ్ ని కంటిన్యూ చేయలేకపోయాడు. ఒకవేళ యశస్వి జైస్వాల్ జట్టులోకి వస్తే అభిషేక్‌పై వేటు పడే అవకాశం ఉంది. ఈ రెండు కారణాల వాళ్ళ అభిషేక్ ఇంగ్లాండ్ తో జరిగే సిరీస్ కు దూరం కానున్నాడు. బంగ్లాదేశ్ మరియు దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లలో అభిషేక్ శర్మ సాధారణ ప్రదర్శన చేశాడు. ఒకవైపు సంజూ శాంసన్, తిలక్ వర్మ లాంటి బ్యాట్స్‌మెన్ సెంచరీల మీద సెంచరీలు సాధిస్తున్నారు. కాగా అభిషేక్ పరుగుల కోసం ఇబ్బంది పడ్డాడు. అభిషేక్ బంగ్లాదేశ్‌తో 3 మ్యాచ్‌ల్లో 35 పరుగులు మరియు దక్షిణాఫ్రికాతో 4 మ్యాచ్‌ల్లో 97 పరుగులు చేశాడు. ఈ కారణంగా అభిషేక్ కు ఇంగ్లాండ్ సిరీస్ లో అవకాశం దక్కకపోవచ్చు. టీ20లో భారత్ తరఫున 5వ వేగవంతమైన సెంచరీ చేసిన రికార్డు అభిషేక్‌పై ఉంది. జింబాబ్వేతో జరిగిన రెండో మ్యాచ్‌లో 46 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఇప్పటి వరకు 12 మ్యాచ్‌ల్లో 1 సెంచరీ, 1 అర్ధ సెంచరీతో 256 పరుగులు చేశాడు.
సొంతగడ్డపై జరగనున్న ఇంగ్లాండ్ సిరీస్ కు జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలని టీమ్ ఇండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. అతడి స్థానంలో కొత్త బౌలర్లకు అవకాశం ఇవ్వనుంది. అంతేకాదు ఈ సిరీస్ ద్వారా మహమ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ స్టార్ ఆటగాళ్లు టి20 తో పాటు వన్డే టోర్నీ కూడా ఆడనున్నట్లు తెలుస్తుంది.