Kolkata Knight Riders: మూడుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) జట్టు గత సీజన్‌లో చాలా నిరాశపరిచే ప్రదర్శన చేసింది. ఈ నేపథ్యంలో షారుక్ ఖాన్ యాజమాన్యంలోని ఈ జట్టు ఇప్పుడు కోచింగ్ సిబ్బందిలో పెద్ద మార్పులు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. టీమ్ హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్‌తో విడిపోవాలని ఫ్రాంచైజీ నిర్ణయించుకుంది. ఇప్పుడు ఆయన స్థానంలో కొత్త కోచ్‌ను వెతుకుతోంది. ఈ రేసులో మాజీ భారత కెప్టెన్ రోహిత్ శర్మకు అత్యంత సన్నిహితుడైన ఒక వ్యక్తి ముందున్నట్లు సమాచారం.
కేకేఆర్ హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయర్
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. ఐపీఎల్ 2026 సీజన్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు అభిషేక్ నాయర్‌ను తమ కొత్త హెడ్ కోచ్‌గా నియమించుకునే అవకాశం ఉంది. గతంలో నాయర్ భారత జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా కూడా పనిచేశారు. ఐపీఎల్ 2024 తర్వాత ఆయన టీమ్ ఇండియాలో చేరారు. కానీ ఆస్ట్రేలియా పర్యటనలో పేలవమైన ప్రదర్శన కారణంగా నాయర్‌ను తొలగించారు.
అయితే అభిషేక్ నాయర్ 2018 నుండి 2024 వరకు కేకేఆర్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా అసిస్టెంట్ కోచ్ పాత్ర పోషించారు. ఐపీఎల్ 2025లో కూడా ఇదే జరిగింది. షారుఖ్ ఖాన్ జట్టు అయిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టుకు కూడా ఆయన గతంలో హెడ్ కోచ్‌గా వ్యవహరించారు.
Also Read: Dev Deepawali: కార్తీక పూర్ణిమ, దేవ దీపావళి ఏ రోజు? ఎన్ని దీపాలు వెలిగిస్తే మంచిది?
రోహిత్ శర్మ ఆటలో మార్పు
టీమ్ ఇండియా కోచింగ్ సిబ్బంది నుండి వైదొలిగిన తర్వాత అభిషేక్ నాయర్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి పనిచేశారు. ఐపీఎల్ 2025 తర్వాత రోహిత్, నాయర్‌తో కలిసి సాధన చేశారు. దీని ఫలితంగానే ‘హిట్‌మ్యాన్’ మరింత ఫిట్‌గా కనిపిస్తూ పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం తెలిసిందే.
రోహిత్ శర్మతో పాటు ఇంగ్లాండ్ పర్యటనకు ముందు కేఎల్ రాహుల్ కూడా నాయర్‌తో కలిసి పనిచేశాడు. ఆ తర్వాత రాహుల్ కూడా మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. రింకూ సింగ్, దినేష్ కార్తీక్, వరుణ్ చక్రవర్తి, అంగక్రిష్ రఘువంశీ వంటి ఆటగాళ్లకు కూడా నాయర్ శిక్షణ ఇచ్చారు. నాయర్‌కు ఉన్న ఈ అనుభవం దృష్ట్యా కేకేఆర్ యాజమాన్యం ఆయనకు హెడ్ కోచ్ బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
