అభిజ్ఞాన్‌ కుందు డబుల్ సెంచరీ.. టీమిండియా కు పరుగుల వరద!

Abhigyan Kundu : అండర్ – 19 ఆసియా కప్‌లో టీమిండియా దుమ్ము రేపుతోంది! మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో వికెట్ కీపర్ అభిగ్యాన్ కుందు డబుల్ సెంచరీతో చెలరేగడంతో, భారత్ 408 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇప్పటికే రెండు సార్లు 400 కు పైగా స్కోర్లు చేసిన టీమిండియా, ఈ టోర్నీలో అదరగొడుతోంది. అభిగ్యాన్ డబుల్ సెంచరీ చేయగా, వేదాంత్ 90 పరుగులు నమోదు చేశాడు. వైభవ్ సూర్యవంశీ 50 పరుగులు చేసి అవుటయ్యాడు. మలేషియాపై […]

Published By: HashtagU Telugu Desk
Abhigyan Kundu's Double Cen

Abhigyan Kundu's Double Cen

Abhigyan Kundu : అండర్ – 19 ఆసియా కప్‌లో టీమిండియా దుమ్ము రేపుతోంది! మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో వికెట్ కీపర్ అభిగ్యాన్ కుందు డబుల్ సెంచరీతో చెలరేగడంతో, భారత్ 408 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇప్పటికే రెండు సార్లు 400 కు పైగా స్కోర్లు చేసిన టీమిండియా, ఈ టోర్నీలో అదరగొడుతోంది. అభిగ్యాన్ డబుల్ సెంచరీ చేయగా, వేదాంత్ 90 పరుగులు నమోదు చేశాడు. వైభవ్ సూర్యవంశీ 50 పరుగులు చేసి అవుటయ్యాడు.

  • మలేషియాపై పరుగుల వరద పారించిన భారత్
  • 125 బంతుల్లో 209 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన అభిగ్యాన్
  • మూడు మ్యాచ్‌లలో రెండు సార్లు 400 స్కోర్ దాటించిన భారత్

అండర్ 19 ఆసియా కప్‌లో టీమిండియా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడితే రెండు సార్లు 400కు పైగా పరుగులు నమోదు చేసింది. మలేషియాతో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్ అభిగ్యాన్ కుందు డబుల్ సెంచరీతో పరుగుల వరద పారించాడు. టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన మలేషియా జట్టు భారీ మూల్యం చెల్లించుకుంది.

దుబాయ్ వేదికగా జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్‌లో భారత్ – మలేషియా జట్లు ఈ రోజు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిని మలేషియా ఫీల్డింగ్ ఎంచుకుని భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆరంభం నుంచి హిట్టింగ్ ప్రారంభించిన టీమిండియా.. పవర్ ప్లేలో బౌండరీల మోత మోగించింది. అదే సమయంలో వికెట్లు కూడా చేజార్చుకుంది.

కెప్టెన్ ఆయుష్ మాత్రే, ఫస్ట్ డౌన్ బ్యాటర్లు విహాన్ మల్హోత్రా త్వరగా వికెట్లు కోల్పోగా.. వైభవ్ సూర్యవంశీ 26 బంతుల్లోనే ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో 50 పరుగులు చేసి అవుటయ్యాడు. వేదాంత్ త్రివేది కూడా నిలకడగా ఆడి 106 బంతుల్లో ఏడు ఫోర్లతో 90 పరుగులు చేసి సెంచరీ మిస్ చేసుకున్నాడు.

మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన టీమిండియా వికెట్ కీపర్ అభిగ్యాన్ కుందు మలేషియా బౌలర్లకు చుక్కలు చూపెట్టాడు. 125 బంతులు ఆడిన అభిగ్యాన్ 17 ఫోర్లు, 9 సిక్సర్లతో 209 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వేదాంత్, అభిగ్యాన్ నాలుగో వికెట్‌కు ఏకంగా 209 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆఖర్లో కనిష్క్ చౌహాన్ – అభిగ్యాన్ 36 బంతుల్లో 87 పరుగులు బాదడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 408 పరుగులు చేసింది. మలేషియా బౌలర్ మొహమ్మద్ అక్రమ్ ఐదు వికెట్లు తీసుకున్నాడు.

అండర్ 19 ఆసియా కప్‌ గ్రూప్ మ్యాచ్‌లలో భారత్ ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో జరిగిన తొలి మ్యాచ్ 433 పరుగులు చేయగా, ఆ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ 171 పరుగులు బాదాడు. పాకిస్తాన్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో 240 పరుగులు మాత్రమే చేసినా దాయాదిని 150 పరుగులకే ఆలౌట్ చేసి విజయం సాధించింది. ఇక మూడో మ్యాచ్‌లో మలేషియాపై 408 పరుగులు చేసింది. ఇలా ఆడిన మూడు మ్యాచ్‌లలోనే రెండు సార్లు 400కు పైగా స్కోర్ నమోదు చేసి రికార్డు సృష్టించింది.

  Last Updated: 16 Dec 2025, 02:58 PM IST