Kohli IPL Participation: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Kohli IPL Participation) 2024 ప్రారంభం కావడానికి కేవలం రెండు వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) మధ్య జరగనుంది. టోర్నీ ఓపెనర్‌లో మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లిల మధ్య జరిగే పోరును చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో వ్యక్తిగత కారణాలతో ఆడని కోహ్లి పునరాగమనంపైనే అందరి దృష్టి కూడా ఉంది. ఇంతలోనే అతను IPL 2024లో ఆడటంపై పెద్ద అప్‌డేట్ వచ్చింది.
ఇంగ్లండ్‌తో జరిగే తొలి రెండు టెస్టు మ్యాచ్‌లకు కోహ్లి టీమ్ ఇండియా జట్టులోకి ఎంపికయ్యాడు. అయితే అతను తన పేరును ఉపసంహరించుకున్నాడు. అప్పటి నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఇటీవల అనుభవజ్ఞుడైన సునీల్ గవాస్కర్ రాబోయే ఐపిఎల్ సీజన్‌ను కూడా కోహ్లీ కోల్పోవచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. సుదీర్ఘ విరామం తర్వాత కోహ్లి మళ్లీ ఆటలోకి వస్తాడా అని గవాస్కర్‌ను ప్రశ్నించగా ఈ సమాధానం చెప్పాడు. కోహ్లీ ఐపీఎల్ ఆడతాడా.. కొన్ని కారణాల వల్ల ఐపీఎల్‌లో కూడా ఆడకపోవచ్చు అని సమాధానం ఇచ్చాడు.
Also Read: Devdutt Padikkal: ఐదో టెస్టులో అరంగేట్రం చేసిన దేవదత్ పడిక్కల్
ఐపీఎల్ 2024లో కోహ్లీ ఆడటం కన్ఫర్మ్ కాలేదు
గవాస్కర్ ప్రకటన తర్వాత.. ఇప్పుడు RCB లెజెండ్ AB డివిలియర్స్ IPL 2024 లో కోహ్లీ ఆడటం ఖచ్చితంగా లేదని చెప్పాడు. ఆర్‌సిబి తరపున కోహ్లీతో చాలా కాలం పాటు ఆడిన డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. కోహ్లీ ఐపీఎల్‌లో ఆడటంపై ఎటువంటి స్పష్టత రాలేదని పేర్కొన్నాడు. అయితే మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈసారి ఐపీఎల్ రెండు దశల్లో జరగనుంది.
We’re now on WhatsApp : Click to Join