Pant-Jadeja: పంత్, జడేజా పార్టనర్ షిప్ పై డివీలియర్స్ ప్రశంసలు

ఇంగ్లాండ్ తో జరుగుతున్న చివరి టెస్టులో భారత్ పట్టుబిగించిందంటే తొలి ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్, రవీంద్ర జడేజా పార్టనర్ షిప్ కారణం.

  • Written By:
  • Updated On - July 4, 2022 / 10:33 PM IST

ఇంగ్లాండ్ తో జరుగుతున్న చివరి టెస్టులో భారత్ పట్టుబిగించిందంటే తొలి ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్, రవీంద్ర జడేజా పార్టనర్ షిప్ కారణం. నిజానికి ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు చాలా మంది ఇంగ్లాండ్ నే ఫేవరెట్ గా భావించారు. సిరీస్ లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉన్నప్పటకీ ప్రస్తుత ఫామ్ దృష్ట్యా ఇంగ్లీష్ టీమ్ వైపే చాలా మంది మొగ్గుచూపారు. కివీస్ తో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడం, భారీ టార్గెట్స్ ను ఛేదించడంతో ఆతిథ్య జట్టు భారత్ ను నిలువరించి సిరీస్ సమం చేస్తుందని అనుకున్నారు.

దానికి తగ్గట్టే తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా టాపార్డర్ విఫలమవడంతో తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. ఈ దశలో పంత్ , జడేజా భాగస్వామ్యం భారత్ ఇన్నింగ్స్ ను నిలబెట్టింది. అదే సమయంలో వీరి పార్టనర్ షిప్ తో ఆతిథ్య జట్టు పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది. రిషబ్‌ పంత్‌, రవీంద్ర జడేజా కౌంటర్‌ అటాక్‌ అస్సలు ఊహించలేకపోయింది. పంత్‌, జడేజా ఆరో వికెట్‌కు ఏకంగా 222 రన్స్‌ భాగస్వామ్యం నెలకొల్పారు. తాజాగా వీరి భాగస్వామ్యంపై సౌతాఫ్రికా లెజెండరీ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ స్పందించాడు.

టెస్ట్‌ క్రికెట్‌లో తాను చూసిన అత్యుత్తమ పార్టనర్ షిప్ ఇదేనని ట్వీట్ చేశాడు. తాను ఇంట్లో లేకపోవడం వల్ల చాలా వరకూ క్రికెట్‌ చూడలేకపోయాననీ, తర్వాత హైలెట్స్ చూసానని చెప్పాడు. పంత్‌, జడేజా కౌంటర్‌ అటాక్ పార్ట్‌నర్‌షిప్‌ టెస్ట్‌ క్రికెట్‌లో తాను చూసిన అత్యుత్తమని డివిలియర్స్‌ ట్వీట్‌ చేశాడు. కఠిన పరిస్థితుల్లో అందులోనూ విదేశాల్లో టీమిండియాను ఆదుకోవడం అలవాటుగా మార్చుకున్న పంత్‌.. ఇప్పుడు ఇంగ్లండ్‌లోనూ సెంచరీతో అదే రిపీట్‌ చేశాడు. ఇదే విషయాన్ని పలువురు మాజీలు ప్రశంసించారు. పంత్ , జడేజా సెంచరీలతో తొలి ఇన్నింగ్స్ లో భారత్ 416 పరుగులు చేసింది.