Praises For Virat: కోహ్లీ ఇన్నింగ్స్ కు మాజీ ఆటగాళ్ళ ప్రశంసలు

ఆఫ్గనిస్థాన్ తో మ్యాచ్ లో సెంచరీతో చెలరేగిన కోహ్లీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. విమర్శకులకు బ్యాట్ తోనే సమాధానమిచ్చాడంటూ పలువురు మాజీ ఆటగాళ్ళు ట్వీట్ చేశారు.

  • Written By:
  • Publish Date - September 8, 2022 / 11:04 PM IST

ఆఫ్గనిస్థాన్ తో మ్యాచ్ లో సెంచరీతో చెలరేగిన కోహ్లీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. విమర్శకులకు బ్యాట్ తోనే సమాధానమిచ్చాడంటూ పలువురు మాజీ ఆటగాళ్ళు ట్వీట్ చేశారు. అజారుద్దీన్ , డివీలియర్స్ , అమిత్ మిశ్రా, మహ్మద్ అమీర్
వంటి మాజీ ఆటగాళ్ళు కోహ్లీని అభినందిస్తూ ట్వీట్లు చేశారు. కోహ్లీకి బెస్ట్ ఫ్రెండ్ అయిన డివీలియర్స్ అందరి కంటే ముందు స్పందించి ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించాడు.

కోహ్లీ డాన్సింగ్.. వాట్ ఏ ఇన్నింగ్స్ అంటూ ట్వీట్ చేశాడు. చాలా రోజుల తర్వాత సెంచరీ చేసిన కోహ్లీకి విషెస్ చెప్పిన అజారుద్దీన్ వెల్ కమ్ హండ్రెడ్ అంటూ ట్వీట్ చేశాడు. ఇక ప్రత్యర్థి జట్లలోనూ చాలా మంది కోహ్లీ బ్యాటింగ్ కు అభిమానులేనని ఎన్నోసార్లు రుజువైంది. తాజాగా పాకిస్థాన్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ , మరో ఆటగాడు హసన్ అలీ కూడా కోహ్లీ ఇన్నింగ్స్ కు ఫిదా అయ్యారు. ది గ్రేట్ కోహ్లీ ఈజ్ బ్యాక్ అంటూ ప్రశంసిస్తూ ట్విట్ చేశారు. అలాగే భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ , పలువురు క్రికెట్ ఎక్స్ పర్ట్స్ కూడా కోహ్లీని అభినందిస్తూ ట్విట్లు చేశారు. ప్రస్తుతం కోహ్లీ సెంచరీ పైనే ట్విట్టర్ లో ట్రెండింగ్ నడుస్తోంది. కోహ్లీ దాదాపు మూడేళ్ళుగా సెంచరీ చేయలేదు.

ఎప్పుడెప్పుడు శతకం చేస్తాడా అని సగటు అభిమాని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న వేళ.. విరాట్ పెను విధ్వంసమే సృష్టించాడు. గత కొంతకాలంగా ప్రమాదకరంగా మారిన ఆప్ఘనిస్థాన్ పై కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అంతర్జాతీయ టీ ట్వంటీల్లో ఇప్పటి వరకూ శతకం సాధించని విరాట్ ఈ మ్యాచ్ తో ఆ లోటు కూడా తీర్చేసుకున్నాడు. అంతేకాదు టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ముందు వరుసగా రెండు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీతో పూర్తి ఫామ్ లోకి వచ్చేశాడు.