Virat – ABD: విరాట్ కోహ్లీకి బాగా పొగరు అనుకున్నాను… ఏబీ డివిలియర్స్ షాకింగ్ కామెంట్స్!

దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులకు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన

  • Written By:
  • Publish Date - March 28, 2023 / 06:35 PM IST

దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులకు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రియులకు విరాట్ కోహ్లీ సుపరిచితమే. కాగా విరాట్ కోహ్లీ ఇప్పటికంటే కెరియర్ ఆరంభంలో ఇంకా యాక్టివ్ గా దూకుడుగా ఉండేవాడు అన్న సంగతి మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా అంతర్జాతీయ మ్యాచ్ అయినా లేదంటే దేశీయ లీగ్ లో అయినా కూడా అలాగే ఉండేవాడు విరాట్ కోహ్లీ. అయితే అప్పట్లో విరాట్ కోహ్లీకీ అహకారం ఎక్కువ అంటూ విమర్శలు కూడా వినిపించాయి.

అయితే అందరితోపాటు నేను కూడా అలాగే అనుకున్నాను అని తెలిపారు ఐపీఎల్ ఒకప్పటి సహచరుడు ఏబీ డివిలియర్స్‌. కాగా ఇండియన్ ప్రీమియర్‌ లీగ్ 2023, 16వ సీజన్‌ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో యూనివర్సల్ బాస్ క్రిస్‌ గేల్‌తో జరిగిన చర్చా కార్యక్రమంలో ఏబీడీ మాట్లాడాడు. విరాట్ గురించి తొలి నాళ్లలో ఏమనుకున్నావు అని గేల్‌ అడిగిన ప్రశ్నకు ఏబీ డివిలియర్స్‌ సమాధానం ఇచ్చాడు. ఈ సందర్భంగా ఏబీ డివిలియర్స్‌ విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతూ..

నేను ఇప్పటికే చాలాసార్లు సమాధానం ఇచ్చాను. విరాట్‌ను తొలిసారి కలిసినప్పుడు అహంకారిగా భావించాను. అతడి హెయిర్‌ స్టైల్‌, ఆడంబరంగా ఉన్న విధానం చూసిన తర్వాత నేను అలా అనుకున్నాను. అయితే, కోహ్లీ ఆత్మవిశ్వాసం స్థాయి మాత్రం అదుర్స్. అతడి ఆటను చూశాక నా అభిప్రాయం మారింది. అయితే, విరాట్ మానవత్వాన్ని దగ్గర నుంచి గమనించిన తర్వాత గౌరవం పెరిగింది. నేను తొలిసారి కోహ్లీని కలిసినప్పుడు అతడి చుట్టూ ఏవో అడ్డంకులు ఉన్నాయి అనిపించింది. అతడు ఆకాశం నుంచి భూమి మీదకు దిగాల్సిన అవసరం ఉందని అనుకున్నాను. చాలా పొగరు అని కూడా అనుకున్నాను. తొలినాళ్లలో అతడి వ్యవహార శైలిని ఇష్టపడలేదు.

కానీ ప్రస్తుతం అతడు అత్యున్నత వ్యక్తిత్వం కలిగిన ఆటగాడు అని ఏబీ డివిలియర్స్‌ చెప్పుకొచ్చాడు. ఎలాంటి డ్యాన్స్‌ అయినా నాదే విజయం.. గేల్‌ విరాట్ కోహ్లీతో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాలను నిర్మించిన క్రిస్‌ గేల్‌ కూడా తన డ్రెస్సింగ్‌ రూమ్‌ అనుభవాలను చెప్పాడు. విరాట్ కోహ్లీ, ఇతర సభ్యులతో డ్రెస్సింగ్‌ రూమ్‌ను పంచుకోవడం కూడా బాగుంది. ఎప్పుడూ సరదాగా, సంతోషంగా ఉండేవాళ్లం. డ్యాన్స్‌ చేస్తూ సంతోషంగా గడిపేశాం. విరాట్ కోహ్లీలోనూ అద్భుతమైన నైపుణ్యం ఉంది. అతడూ తన డ్యాన్స్‌ చేసేవాడు అంటూ ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నారు గేల్.