AUS vs PAK: ఫీల్డింగ్ ఎలాగో చేయరు.. బౌలింగ్ లోనూ ఇదే పరిస్థితి

ప్రపంచ క్రికెట్లో మిస్ ఫీల్డింగ్​తో చివాట్లు తినే జట్టు ఏదంటే పాకిస్థాన్ అని నిర్మొహమాటంగా చెప్తారు ఫాన్స్. చేతుల్లోకి వచ్చిన ఈజీ క్యాచుల్ని నేలపాలు చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురవుతుంటారు.

AUS vs PAK: ప్రపంచ క్రికెట్లో మిస్ ఫీల్డింగ్​తో చివాట్లు తినే జట్టు ఏదంటే పాకిస్థాన్ అని నిర్మొహమాటంగా చెప్తారు ఫాన్స్. చేతుల్లోకి వచ్చిన ఈజీ క్యాచుల్ని నేలపాలు చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురవుతుంటారు. మైదానంలో వాళ్ళు చేసే కొన్ని పనుల వల్ల మీమర్స్ కు కావాల్సినంత స్టఫ్ దొరుకుతుంది. ప్రపంచ క్రికెట్లో చెత్త ఫీల్డింగ్ పోటీలు పెడితే మేమే గెలుస్తామని చేయి పైకి ఎత్తే పరిస్థితిని తీసుకొచ్చారు.

ఒక్కప్పుడు క్రికెట్లో పాకిస్థాన్ బలమైన జట్టుగా కొనసాగింది. కానీ ప్రస్తుతం పాక్ జట్టు ఆటగాళ్లు, వాళ్ళు చేసే విచిత్ర విన్యాసాలు అభిమానుల్ని ఇరిటేట్ చేస్తున్నాయి. తాజాగా పాకిస్థాన్ బౌలర్ చేసిన పనికి నెటిజన్స్ సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. మీరింకా మారారా అంటూ ట్రోల్స్ కు పాల్పడుతున్నారు. ఇంతకీ ఈ మహానుభావులు చేసిన తింగరి పనేంటో ఓ సారి చూద్దాం. ఈసారి ఫీల్డింగ్​లో కాకుండా బౌలింగ్​ పరంగా ఆ టీమ్ వార్తల్లో నిలిచింది. పాక్ ఆల్​రౌండర్ ఆమిర్ జమాల్ వేసిన ఓ నో బాల్ ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఆస్ట్రేలియా(Australia)-పాకిస్థాన్ (Pakistan)​ మధ్య జరుగుతున్న టెస్ట్​లో ఆసీస్ స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ క్రీజులో ఉండగా పాక్ పేసర్ ఆమిర్ జమాల్ బౌలింగ్ కు దిగాడు. అయితే తన చేతిలో బంతి లేకున్నా పరిగెత్తుకుంటూ వచ్చి బౌలింగ్ యాక్షన్ ఇచ్చాడు. అంపైర్​ వద్దకు రాగానే రెండు చేతులు ముందుకు చాచి తన దగ్గర బాల్ లేదన్నట్టు చూపించాడు. దీంతో స్ట్రైకింగ్ లో ఉన్న లబుషేన్ తెల్లబోయాడు. నాన్​ స్ట్రయికింగ్ ఎండ్​లో ఉన్న స్టీవ్ స్మిత్ కి కూడా ఏమర్థం కాలేదు. కాగా ఈ బంతిని అంపైర్ నోబాల్​గా ప్రకటించాడు. దీంతో బౌలర్ ఆమిర్ నవ్వుకుంటూ వెళ్లిపోయాడు.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో క్రికెట్ ఫాన్స్ దీన్ని ఫన్నీగా తీసుకోకుండా పాక్ తీరుపై మండిపడుతున్నారు. ఎలాగో ఫీల్డింగ్ చేసేటప్పుడు బాల్ పట్టుకోలేరు. బౌలింగ్ చేసేటప్పుడైనా బంతి లేకపోతేలాగా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. స్పిన్నర్లు బాల్​ను కనిపించకుండా హోల్ట్ చేసి బౌలింగ్ వేస్తుంటారు. స్వింగ్ అర్ధం కాకుండా ఇలా బంతిని దాచుంచి బ్యాటర్లను కన్ఫ్యూజ్ చేస్తుంటారు. కానీ చేతుల్లో బాల్ లేకున్నా బౌలింగ్ చేయడం కేవలం దాయాది జట్టుకే సాధ్యమని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Also Read: 2024 Sankranti : సంక్రాంతి పండగ వేళ ఓ ‘కీడు’ ప్రచారం వైరల్ గా మారింది..