Site icon HashtagU Telugu

Hardik Pandya: పాండ్యపై మండిపడ్డ ఆకాశ్ చోప్రా

Hardik Pandya

New Web Story Copy 2023 08 12t211230.210

Hardik Pandya: వెస్టిండీస్ పర్యటనలో భారత్ ప్రస్తుతం అయిదు టీ20 సిరీస్ ఆడుతుంది. మొదటి రెండు మ్యాచ్ లో ఓడినప్పటికీ మూడో మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. అయితే మూడో టీ20 మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా చేసిన పనికి ఓ రేంజ్ లో విమర్శలు ఎదుర్కొన్నాడు. సోషల్ మీడియాలో ట్రోల్స్ ఒకవైపు, మాజీ ఆటగాళ్లు మరోవైపు మూకుమ్మడిగా విమర్శలు కురిపించారు.

వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ ఐదు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత్ 17.5 ఓవర్లలో మూడు వికెట్లకు 164 పరుగులు చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. ఇన్నింగ్స్ లో సూర్యకుమార్ యాదవ్ 83 పరుగులతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తెలుగు తేజం తిలక్ వర్మ 49 పరుగులు చేసి హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. విజయానికి 14 బంతుల్లో కేవలం రెండు పరుగులు మాత్రమే అవసరం కాగా, 17వ ఓవర్ 4వ బంతికి హార్దిక్ పాండ్యా తన విలక్షణమైన శైలిని ప్రదర్శించి, సిక్సర్‌తో గేమ్‌ను ముగించాడు. దీంతో తిలక్ వర్మ హాఫ్ సెంచరీని అడ్డుకున్నాడంటూ హార్దిక్ పై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్స్ చేశారు.

ధోనీని, కోహ్లీని చూసి బుడ్డి తెచ్చుకో హార్దిక్ అంటూ చురకలంటించారు.మ్యాచ్ అనంతరం మాజీలు కూడా హార్దిక్ విధానాన్ని తప్పుబట్టారు. తాజాగా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా రియాక్ట్ అయ్యాడు. తిలక్‌ను వద్దని హార్దిక్ భారీ షాట్లు ఆడాడు.. సింగిల్ తీస్తే ఏం పోయేది అంటూ హార్దిక్‌ పాండ్యాపై ఆకాశ్ చోప్రా తీవ్రంగా మండిపడ్డాడు. ఇక్కడేమీ నెట్ రన్‌రేట్ అవసరం లేదు కదా.. సింగిల్ తీసి తిలక్ కు అవకాశం ఇస్తే ఏం పోయేది అంటూ పాండ్యాపై ఆకాశ్ విరుచుకుపడ్డాడు.

Also Read: Dalit Farmer: దళిత రైతును కట్టేసి కొట్టిన రెడ్డి