British girl: చెస్ లో చరిత్ర సృష్టించిన ఎనిమిదేళ్ల బ్రిటీష్ విద్యార్థిని

భారతదేశ సంతతికి చెందిన ఎనిమిదేళ్ల బ్రిటీష్ విద్యార్థిని చదరంగంలో చరిత్ర సృష్టించింది. ఇటీవల క్రొయేషియా రాజధాని జాగ్రెబ్‌లో జరిగిన యూరోపియన్ 'బ్లిట్జ్' చెస్ విన్నర్స్ టోర్నమెంట్‌లో బోధనా

British girl: భారతదేశ సంతతికి చెందిన ఎనిమిదేళ్ల బ్రిటీష్ విద్యార్థిని చదరంగంలో చరిత్ర సృష్టించింది. ఇటీవల క్రొయేషియా రాజధాని జాగ్రెబ్‌లో జరిగిన యూరోపియన్ ‘బ్లిట్జ్’ చెస్ విన్నర్స్ టోర్నమెంట్‌లో బోధనా శివానందన్ అరుంతిరన్ అత్యుత్తమ మహిళా క్రీడాకారిణిగా ఎంపికైంది. గత వారాంతంలో జరిగిన టోర్నీలో ప్రపంచంలోని అత్యుత్తమ చెస్ క్రీడాకారులతో తలపడిన పోతన ఒక ఇంటర్నేషనల్ చెస్ మాస్టర్ను ఓడించింది. ఆమె 13కి 8.5 పాయింట్లు సాధించి టైటిల్ గెలుచుకున్నది. దీంతో బాలికపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

గేమ్ గెలవడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. కొన్నిసార్లు విజయం సాదిస్తాము; కొన్నిసార్లు మనం గెలవలేకపోవచ్చు కానీ పట్టుదల వదలకూడదని బోధనా బీబీసీతో చెప్పింది. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో ఆమెకు చెస్‌పై ఆసక్తి పెరిగిందని చెప్పుకొచ్చింది.కొన్ని నెలల క్రితం బ్రిటన్ ప్రధాని రిషి సునక్ తన నివాసానికి ఆహ్వానించిన యువ చెస్ ఆటగాళ్ల బృందంలో బోధనా కూడా ఉండటం గమనార్హం. బోధనాకు చదరంగం ఆడటం, ప్రయాణాలు చేయడం ఇష్టమని అతని తండ్రి శివానందన్ తెలిపారు.

Also Read: Aadhaar: ఆధార్ లో పేరు,అడ్రస్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు.. ప్రభుత్వం ఏమి చెబుతోందంటే?