Site icon HashtagU Telugu

Ranji Trophy: రంజీ ట్రోఫీలో ఆడేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన స్టార్ ఆట‌గాళ్లు వీరే!

Ranji Trophy

Ranji Trophy

Ranji Trophy: ఆస్ట్రేలియా టూర్‌లో భారత జట్టు పేలవ ప్రదర్శనను ప్రపంచం మొత్తం చూసింది. ముఖ్యంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో (Ranji Trophy) భారత బ్యాట్స్‌మెన్ నిరాశపరిచారు. కంగారూలపై భారత ప్రధాన బ్యాట్స్‌మెన్ ఎవరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. విదేశీ గడ్డపై పేలవ ప్రదర్శన చేసి తిరిగి వచ్చిన భారత ఆటగాళ్లు ఇప్పుడు రంజీ ట్రోఫీలో తమ జట్టు తరఫున పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. మొత్తం ఐదు మంది ఆటగాళ్లు రంజీ ట్రోఫీ ఆడాల్సి ఉండగా, అందులో ఒక ఆటగాడు 10 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ ఆడబోతున్నాడు. అయితే కోహ్లీ, రాహుల్ గాయాల కార‌ణంగా రంజీ ట్రోఫీలో ఆడ‌లేక‌పోతున్న‌ట్లు బీసీసీఐకి తెలియ‌జేశారు.

ఈ ఐదుగురు ఆటగాళ్లు రంజీ ఆడనున్నారు

టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం.. రోహిత్ శర్మ ముంబై తరపున తదుపరి రంజీ మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. 10 ఏళ్ల తర్వాత ఈ టోర్నీలో పాల్గొన‌నున్నాడు. 2015లో ఉత్తరప్రదేశ్‌తో చివరిసారిగా హిట్‌మన్ రంజీ మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత కెప్టెన్ 113 పరుగులు చేశాడు. ముంబై తదుపరి మ్యాచ్ జమ్మూ కాశ్మీర్‌తో జరగబోతోంది. అతనితో పాటు యశస్వి జైస్వాల్ కూడా ముంబైకి చెందిన రంజీ ట్రోఫీలో ఆడ‌నున్నాడు. శుభమన్ గిల్ కూడా పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు.

Also Read: Windies Spinner: పాకిస్థాన్ గడ్డపై చ‌రిత్ర సృష్టించిన విండీస్ ఆటగాడు

ఆస్ట్రేలియా పర్యటనలో గిల్ కూడా నిరాశ‌ప‌ర్చాడు. అయితే బీసీసీఐ అతడిని ఛాంపియన్స్ ట్రోఫీకి వైస్ కెప్టెన్‌గా నియ‌మించింది. రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరఫున రిషబ్ పంత్ కూడా పాల్గొననున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ అతని బ్యాట్ కాస్త రాణించింది. దీంతో పాటు సౌరాష్ట్ర తరఫున రవీంద్ర జడేజా కూడా రంజీ ఆడబోతున్నాడు.

రోహిత్ శర్మ గురించి మాట్లాడుకుంటే ఆస్ట్రేలియా పర్యటనలో అతని ప్రదర్శన పేలవంగా ఉంది. 5 ఇన్నింగ్స్‌ల్లో అతని బ్యాట్‌ నుంచి ఒక్క అర్ధ సెంచరీ కూడా రాలేదు. తన 5 ఇన్నింగ్స్‌లలో 3,9,10,3, 6 పరుగులు చేశాడు. అలాగే మొద‌టి టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన తర్వాత యశస్వి జైస్వాల్ పేలవ ప్రదర్శన కనబరిచాడు. ఆస్ట్రేలియా గడ్డపై గిల్ ఒక్క సెంచరీ కూడా చేయలేదు. పంత్ కూడా 10 ఇన్నింగ్స్‌ల్లో 1 అర్ధ సెంచరీ మాత్రమే చేయగలిగాడు. ఇప్పుడు ఈ భారత స్టార్ ఆట‌గాళ్లు రంజీలో రాణించి ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహాలను పూర్తి చేయాలనుకుంటున్నారు.