T20 World Cup 2024: మూడు నెలల పాటు క్రికెట్ అభిమానుల్ని అలరించిన ఐపీఎల్ సీజన్ ముగిసింది. భారీ అంచనాలతో టోర్నీలో అడుగుపెట్టిన జట్లు ప్లేఆఫ్స్ కి కూడా చేరకపోగా ఫైనల్లో కేకేఆర్, సన్ రైజర్స్ జట్లు తలపడ్డాయి. అయితే ఆరంభం నుంచి బ్యాటింగ్ లైనప్ తో హోరెత్తించిన సన్ రైజర్స్ చెపాక్ లో మాత్రం తడబడింది. భారీ హిట్టర్లున్న ఆ జట్టు ఓపెనర్లు తీవ్రంగా నిరాశపరిచారు.. మిడిల్ ఆర్డర్ పరిస్థితి కూడా పేలవంగానే సాగింది. అటు బౌలింగ్ అంతంతమాత్రమగానే పడింది. ఫలితంగా కేకేఆర్ కి కలిసొచ్చింది. దీంతో పదేళ్ల నిరీక్షణ తర్వాత శ్రేయాస్ అయ్యర్ సారధ్యంలో కేకేఆర్ మూడో టైటిల్ గెలిచింది. అంతకుముందు గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో కేకేఆర్ రెండు సార్లు కప్ కొట్టింది.
ఐపీఎల్ ముగిసినప్పటికీ ఫ్యాన్స్ ని అలరించేందుకు సిద్ధమైంది మినీవరల్డ్ కప్. విదేశీ గడ్డపై జూన్ 2 నుండి టి20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది.ఈసారి ఈ టోర్నీకి వెస్టిండీస్, అమెరికా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. మే 25న టీమిండియా అమెరికా వెళ్లింది. ఈసారి రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు ఈ టోర్నీ ఆడనుంది. టీమిండియా ఐసీసీ ట్రోఫీ గెలవక చాలా కాలమైంది. ఈసారి టైటిల్‌ను కైవసం చేసుకుని ఐసీసీ నిరీక్షణకు తెరదించాలని భావిస్తుంది. అంతకుముందు 2022లో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీఫైనల్ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో టీమిండియాను ప్రపంచ ఛాంపియన్‌గా మార్చగల ఐదుగురు ఆటగాళ్లపై అందరి ఫోకస్ పడింది. మరి ఆ స్టార్ ఆటగాళ్లెవరో చూద్దాం.
నంబర్ స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టి20 ప్రపపంచకప్ లో ఎలా ఆడతాడన్న దానిపై విశ్లేషకులు అంచనా ఇస్తున్నారు. టీమిండియాకు శుభారంభం అందించాల్సిన బాధ్యత రోహిత్ శర్మపైనే ఉందంటున్నారు. భారత జట్టుకు శుభారంభం అందించడంలో రోహిత్ రాణిస్తే.. భారత్ ఈ టైటిల్‌ను కైవసం చేసుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. గతేడాది చివర్లో జరిగిన ఐసీసీ ప్రపంచకప్ లో ఓపెనర్ గా రోహిత్ విధ్వంసం గుర్తుండే ఉంటుంది. మైదానంలో ఉన్న ఆ కాసేపు ఆస్ట్రేలియన్ బౌలర్లపై విధ్వంసం సృష్టించాడు. 31 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 47 పరుగులతో బాధ్యయుతమైన స్కోర్ అందించాడు. అయితే టి20 ప్రపంచకప్ లో రోహిత్ మూడు ఓవర్లు ఆడినా చాలని అంటున్నారు. ఇక నెక్స్ట్ విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుకోవాలి. టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లి టీమ్ ఇండియాకు కీలక పాత్ర పోషిస్తున్నాడు. అంతకుముందు 2022 టీ20 ప్రపంచకప్‌లో కోహ్లీ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. ఆ సీజన్లో పాకిస్థాన్ మీద కోహ్లీ విధ్వంసం ఎప్పటికీ మర్చిపోలేము. అసలు విజయంపై 1 పర్సెంట్ విజయావకాశం ఉన్న సమయంలో హార్దిక్ పాండ్యతో కలిసి కోహ్లీ ఉప్పెనలా ఎగసిపడ్డాడు. అయితే జట్టును ఛాంపియన్‌గా మార్చలేకపోయాడు. ఈసారి టి20 ప్రపంచకప్ విషయంలో కోహ్లీపై భారత అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
టి20 ర్యాంకింగ్స్‌లో నంబర్-1 బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా టి20 ప్రపంచకప్ లో నిలకడగ రాణిస్తే భారత్ కు తిరుగుండదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాచ్ గమనాన్ని మార్చే సత్తా సూర్యకు ఉంది. సూర్య మంచి ఫామ్‌లో కొనసాగితే టీమ్ ఇండియా ఛాంపియన్‌గా మారుతుందనడంలో డౌటే లేదు. 2022 టీ20 ప్రపంచకప్‌లో సూర్య 239 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇక టీ20 ప్రపంచకప్ లో జస్ప్రీత్ బుమ్రా టీమిండియా బౌలింగ్ దళానికి మెయిన్ పిల్లర్ లాంటోడు. ఈ సీజన్ ఐపీఎల్ లో బుమ్రా అద్భుత ప్రదర్శన చేశాడు. బుమ్రా తన ఫామ్‌ను కొనసాగించాలని మరియు టీమ్ ఇండియాను ఛాంపియన్‌గా మార్చడంలో గణనీయమైన సహకారం అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు.ఐపీఎల్ 2024లో కుల్దీప్ యాదవ్ అద్భుతంగా రాణించాడు. టీ20 ప్రపంచకప్‌లో కూడా అతని స్పిన్ భారత్‌కు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రధాన స్పిన్నర్‌గా కుల్దీప్ ఆడనున్నాడు. టీమ్ ఇండియా ఛాంపియన్‌గా నిలవడంలో కుల్దీప్ ఫామ్ హెల్ప్ అవుతుంది. వీళ్ళే కాకుండా మిగతా ఆటగాళ్లు కూడా ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు.ఏదేమైనప్పటికీ మనోళ్లు సమిష్టిగా రాణిస్తే టి20 ప్రపంచకప్ మనదే అవుతుంది అనడంలో సందేహపడాల్సిందే లేదు.
Also Read: Shreyas Iyer: రోహిత్ తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్‌గా అయ్యర్..?